Petrol Price Today: మంట పుట్టిస్తున్న ఇంధన ధరలు.. ఒకరోజు గ్యాప్ తర్వాత పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్స్..
Petrol Price Today: ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో దాదాపు 4 నెలలపాటు శాంతించిన పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. వరుసగా రెండు రోజులు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు..
Petrol Price Today: ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో దాదాపు 4 నెలలపాటు శాంతించిన పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. వరుసగా రెండు రోజులు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు గురువారం కాస్త బ్రేక్ పడింది. దీంతో ఇంధన ధరలు శాంతించాయని పడుతుందని అంతా సంతోషించారు. అయితే శుక్రవారం మళ్లీ బాదుడు మొదలైంది. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో శుక్రవారం పెట్రోల్, డీజిల్ ధరల్లో పెరుగుదల కనిపించింది. నేడు నమోదైన పెట్రోల్, డీజిల్ ధరలపై ఓ లుక్కేయండి..
* దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 80 పైసల చొప్పున పెరిగి లీటర్ పెట్రోల్ ధర రూ. 97.85కాగా, డీజిల్ ధర రూ. 89.11కి చేరింది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ 84పైసలు, డీజిల్ 85పైసలు పెరిగింది. దీంతో పెట్రోల్ లీటర్ ధర రూ.112.49కు, డీజిల్ ధర రూ.96.68కు పెరిగింది.
* తమిళనాడు రాజధాని చెన్నైలో లీటర్ పెట్రోల్‌పై 75పైసలు, డీజిల్‌పై 76 పైసలు పెరిగి.. లీటర్ పెట్రోల్ రూ.103.65కు ఎగబాకింది. డీజిల్ రూ.93.7కు చేరింది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు..
* హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెరిగింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.110.89కి చేరుకుంది. డీజిల్ ధర రూ.97.22కి పెరిగింది.
* గుంటూరులో లీటర్ పెట్రోల్ రూ. 112.96, డీజిల్ రూ. 98.94కు చేరింది.
* సాగరతీరం విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ రూ. 111.66కాగా, డీజిల్ రూ. 97.68కి చేరింది.
Also Read: RRR Movie Release Live: జాతర మొదలైంది.. ఆర్ఆర్ఆర్ థియేటర్స్ దగ్గర పండగ వాతావరణం..
Vitamin D: శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? విటమిన్ డీ లోపం ఉన్నట్లే.. అవేంటో తెలుసుకోండి