Multibagger Stock: ఏడాదిలో పెట్టుబడిని డబుల్ చేసిన మల్టీ బ్యాగర్ స్టాక్.. మీ దగ్గర కూడా ఈ షేర్ ఉందా..!
Multibagger Stock: మల్టీ బ్యాగర్ స్టాక్స్ తక్కువ కాలంలోనే ఇన్వెస్టర్లకు మంచి రిటర్న్ అందిస్తుంటాయి. ఈ షేర్ కూడా తన పెట్టుబడిదారుల సంపదను కేవలం ఒక్క సంవత్సరంలోనే డబుల్(Investment Doubled) చేసేసింది.
Multibagger Stock: మల్టీ బ్యాగర్ స్టాక్స్ తక్కువ కాలంలోనే ఇన్వెస్టర్లకు మంచి రిటర్న్ అందిస్తుంటాయి. ఈ షేర్ కూడా తన పెట్టుబడిదారుల సంపదను కేవలం ఒక్క సంవత్సరంలోనే డబుల్(Investment Doubled) చేసేసింది. ఇండస్ట్రియల్ టర్బైన్స్ తయారీ సంస్థ త్రివేణీ టర్బైన్ లిమిటెడ్(Triveni Turbine Limited) కంపెనీ కేవలం 12 నెలల కాలంలో 100 శాతం రిటర్న్ అందించింది. ఏడాది కిందట రూ.101.90 ఉన్న షేర్ విలువ ప్రస్తుతం రూ.205.30కి చేరుకుంది. బీఎస్ఈ ఎక్స్ఛేంజ్ లో రూ.198.95 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైన షేర్ రోజు మెుత్తంలో 3 శాతం పెరిగి గరిష్ఠంగా పెరిగి రూ. 205.30ను తాకింది. చివరికి రోజు ముగిసే నాటికి షేర్ విలువ రూ.201.70గా ఉంది. ఇంట్రాడే లో 3 శాతం వరకు పెరిగిన కంపెనీ షేర్ విలువ చివరికి 1.38 శాతం వృద్ధిలో ముగిసింది.
కంపెనీ ప్రస్తుత మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6,500 కోట్లుగా ఉంది. ప్రస్తుతం కంపెనీ 5,20,50,100, 200 రోజుల మూవింగ్ యావరేజ్ ను క్రాస్ చేసి ట్రేడ్ అవుతోంది. కంపెనీ మంచి పనితీరుతో పాటు ఎక్కువ రెవెన్యూలను అందిస్తోంది. ఈ షేర్ రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. గడచిన డిసెంబర్ క్వార్టర్లో 30 శాతం నెట్ ప్రాఫిట్ వృద్ధిని నమోదు చేసి రూ. 35.67 కోట్లుగా ఉంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఈ లాభం రూ. 27.54 గా ఉంది. ఇదే సమయంలో నెట్ సేల్స్ 30 శాతం పెరిగి రూ. 225.15 కోట్లుగా నమోదయింది. ప్రస్తుతం కంపెనీ ఆర్డర్ బుక్ రూ.1200 కోట్లుగా ఉంది. కంపెనీ ఈ మధ్య కాలంలో సౌల్ ఆఫ్రికాలోని టీఎస్ఈ ఇంజినీరింగ్ కంపెనీలోని 70 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు దీర్ఘకాలంలో కంపెనీ మంచి ఫలితాలు సాధించేందుకు ఉపకరించనుంది.
NOTE: షేర్ మార్కెట్లో పెట్టుబడులు రిస్క్ తో కూడుకున్న అంశం. పైన అందించిన వివరాలు కేవలం సమాచారం కోసం మాత్రమే. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేముందు మీ ఆర్థిక సలహాదారు సలహాలను తప్పక తీసుకోండి.
ఇవీ చదవండి..
Airtel Offer: ఎయిర్ టెల్ వినియోగదారులకు బంపర్ ఆఫర్.. ఆ యూజర్లకు ఫ్రీ ఓటీటీ..