AP Crime: కానిస్టేబుల్ ఉద్యోగం పోగొట్టుకున్నాడు.. గంజాయి స్మగ్లర్ గా మారాడు.. చివరికి
నేరాలకు అడ్డు కట్ట వేయాల్సిన ఓ కానిస్టేబుల్ గంజాయి స్మగ్లర్ (smuggler) గా మారాడు. గతంలో తనపై నమోదైన ఓ కేసుతో సస్పెండ్ (Suspend) కు గురైన కానిస్టేబుల్.. విలాసాలకు బానిసయ్యాడు.సులభంగా డబ్బు సంపాందించేందుకు...
నేరాలకు అడ్డు కట్ట వేయాల్సిన ఓ కానిస్టేబుల్ గంజాయి స్మగ్లర్ (smuggler) గా మారాడు. గతంలో తనపై నమోదైన ఓ కేసుతో సస్పెండ్ (Suspend) కు గురైన కానిస్టేబుల్.. విలాసాలకు బానిసయ్యాడు.సులభంగా డబ్బు సంపాందించేందుకు గంజాయిని సరఫరా చేసేవాడు. ఈ క్రమంలో ముందస్తు అందిన సమాచారంతో పోలీసులు కానిస్టేబుల్ ను పట్టకున్నారు. మరో ఘటనలో అక్రమంగా తరలిస్తున్న 255 కేజీల గంజాయిని పెద్దాపురం పోలీసులు పట్టుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం గూడెంకొత్తవీధికి చెందిన సత్యనారాయణ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. భార్యతో గొడవ జరగడంతో కాకినాడ(Kakinada) ఏపీఎస్పీ మూడో బెటాలియన్‌లో చేస్తున్న సమయంలో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో సత్యనారాయణను సస్పెండ్ చేసిన అధికారులు.. 2020లో విధుల నుంచి తొలగించారు. ఈ క్రమంలో తీవ్ర వేదనకు గురైన సత్యనారాయణ.. విలాసాలకు అలవాటుపడ్డాడు. నగదు కోసం ఏజెన్సీలో గంజాయిని కొని రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో విక్రయించడం ప్రారంభించాడు.
ఈ నేపథ్యంలో 4.3 కేజీల గంజాయిని సురేంద్ర అనే వ్యక్తి ద్వారా నామవరం శాటిలైట్ సిటీ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి విక్రయించేందుకు ప్రయత్నించాడు. ముందస్తు సమాచారంతో పోలీసు ఉన్నతాధికారులు వీరిని అరెస్టు చేశారు. మరో ఘటనలో అక్రమంగా తరలిస్తున్న 255 కేజీల గంజాయిని పెద్దాపురం పోలీసులు పట్టుకున్నారు. జగ్గంపేట వైపునకు కారులో గంజాయి తరలిస్తున్నట్లు జిల్లా ఎస్పీ కార్యాలయ సమాచారం అందింది. కారు ను తనిఖీ చేస్తున్న సమయంలో 13 బస్తాల్లో 255.45 కేజీల గంజాయి లభ్యమైంది. సరకుతో పాటు ఓ కారు, అయిదు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read
RRR Public Talk Live: ఆర్ఆర్ఆర్ దండయాత్ర షురూ.. పబ్లిక్ టాక్ వింటే గూస్‌బంప్స్ ఖాయం..(వీడియో)