Fake Certificates: నకిలీ సర్టిఫికేట్లతో ముప్పై ఏళ్లకు పైగా సేవలు.. అధికారుల దర్యాప్తులో సంచలన విషయాలు
కస్టమ్స్ విభాగంలో (Customs Department) దాదాపు ముప్పై ఏళ్లకు పైగా వివిధ హోదాల్లో పని చేశాడు. అసిస్టెంట్ కమిషనర్ స్థాయికి ఎదిగాడు. అంతలోనే ఉన్నతాధికారుల విచారణలో షాకింగ్ విషయాలు తెలిశాయి. ఫేక్ సర్టిఫికేట్లతో...
కస్టమ్స్ విభాగంలో (Customs Department) దాదాపు ముప్పై ఏళ్లకు పైగా వివిధ హోదాల్లో పని చేశాడు. అసిస్టెంట్ కమిషనర్ స్థాయికి ఎదిగాడు. అంతలోనే ఉన్నతాధికారుల విచారణలో షాకింగ్ విషయాలు తెలిశాయి. ఫేక్ సర్టిఫికేట్లతో(Fake Certificates) ఉద్యోగం సంపాదించాడని తెలిసి అవాక్కయ్యారు. ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు (Investigation) చేస్తే ఇంకా ఆశ్చర్యకర విషయాలు వెల్లడయ్యాయి. అతని డిగ్రీ సర్టిఫికెట్లు నకిలీవంటూ ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్‌లోని జీఎస్టీ & కస్టమ్స్ చీఫ్ కమిషనర్ ఆఫీస్ లో కస్టమ్స్ అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న సంజయ్ శాంతారాం పాటిల్.. 1990 డిసెంబరు 21 న ముంబయి కస్టమ్స్ విభాగంలో కస్టమ్స్ ప్రివెన్షన్ అధికారిగా ఉద్యోగంలో చేరాడు. అతని డిగ్రీ సర్టిఫికెట్లు నకిలీవంటూ సంజయ్ జాదవ్ అనే వ్యక్తి 2015లో ముంబయిలోని అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ (కస్టమ్స్) కార్యాలయంలో కంప్లైంట్ చేశాడు. దీనిపై విచారణ జరుగుతుండగానే 2017లో సంజయ్‌పాటిల్ అసిస్టెంట్ కమిషనర్‌గా పదోన్నతి పొంది, హైదరాబాద్‌కు బదిలీ చేశారు. నకిలీ సర్టిఫికెట్ల కేసు దర్యాప్తులో భాగంగా పాటిల్ సమర్పించిన పత్రాలను కస్టమ్స్ విజిలెన్స్ విభాగం అధికారులు పరిశీలించారు.
డిగ్రీ విద్యార్హత పత్రంతో పాటు ప్రొవిజనల్, మైగ్రేషన్, మోమోలు, హాల్‌టిక్కెట్ కూడా నకిలీవేనని తేలింది. దీంతో 2019 ఏప్రిల్ 26న ఉన్నతాధికారులు సంజయ్‌పాటిల్‌ను సస్పెండ్ చేశారు. తదుపరి చర్యల కోసం హైదరాబాద్ జీఎస్టీ అండ్ కస్టమ్స్ చీఫ్ కమిషనర్ కార్యాలయానికి చెందిన అదనపు కమిషనర్ కె.జి.వి.ఎన్.సూర్యతేజ 2021 నవంబరు 12న హైదరాబాద్ సీబీఐ విభాగానికి ఫిర్యాదు చేశారు. సీబీఐ అధికారులు జరిపిన ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ లోనూ ధ్రువపత్రాలన్నీ నకిలీవేనని తేలడంతో అధికారులు కేసు నమోదు చేశారు.
Also Read
Shamna Kasim: అదిరే అందాలతో కల్లోలం సృష్టిస్తున్న `ఢీ` భామ లేటెస్ట్ ఫోటోస్ వైరల్