Committed Suicide: కాలేజీకి వెళ్లకుండా సినిమాకు వెళ్లినందుకు తండ్రి మందలింపు.. యువకుడు ఆత్మహత్య
Committed Suicide: కొందరు తెలిసీ తెలియకో చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోతున్నారు. తండ్రి తిట్టాడనో, తల్లి కొట్టిందనే ప్రేమ విఫలమైందనే ఇలా రకరకాల కారణాల వల్ల ఎంతో..
Committed Suicide: కొందరు తెలిసీ తెలియకో చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోతున్నారు. తండ్రి తిట్టాడనో, తల్లి కొట్టిందనే ప్రేమ విఫలమైందనే ఇలా రకరకాల కారణాల వల్ల ఎంతో మంది తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. చిన్నపాటి కారణాల వల్ల యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఏపీలో అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గంలోని మారెమ్మ గుడి వీధిలో ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ రోజు ఆర్‌ఆర్‌ఆర్ (RRR) సినిమా విడుదలైంది. అయితే ఆ యువకుడు కళాశాలకు వెళ్లకుండా సినిమాకు వెళ్లాడు శంకర్ (Shankar) అనే యువకుడు. ఇక సినిమా చూసి ఇంటికి వచ్చిన యువకుడిని తండ్రి మైలారప్ప మందలించాడు. దీంతో మనస్థాపినిక గురై ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.
ఇవి కూడా చదవండి: