Insurance Fraud: ఇన్సూరెన్స్ పేరుతో రూ.3.5 కోట్ల మోసం.. మూడు రోజుల్లోనే కేసును ఛేదించిన పోలీసులు.. నిందితుల అరెస్ట్
Insurance Fraud: ప్రస్తుతం సైబర్ నేరాలు ఎన్నో జరుగుతున్నాయి. నేరాలకు పాల్పడేవారు రోజురోజుకు పుట్టుకొస్తున్నారు. టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో మోసాలు పెరిగిపోతున్నాయి...
Insurance Fraud: ప్రస్తుతం సైబర్ నేరాలు ఎన్నో జరుగుతున్నాయి. నేరాలకు పాల్పడేవారు రోజురోజుకు పుట్టుకొస్తున్నారు. టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో మోసాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పోలీసులు ఇలాంటి మోసాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఎక్కువగా బ్యాంకింగ్ (Banking) రంగంలో మోసాలు పెరిగిపోతున్నాయి. బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామంటూ మోసాలకు పాల్పడున్నారు. బ్యాంకు లోన్స్ (Bank Lones), ప్రైవేటు ఫైనాన్స్ సెక్టార్ల పేరుతో అమాయకులను మోగిస్తున్నారు నేరగాళ్లు. ఈ నేపథ్యంలో తాజాగా మరో బడా మోసం జరిగింది. ఇన్సూరెన్స్ పేరుతో రూ. 3.5 కోట్ల భారీ మోసం జరిగింది. ఈ వ్యవహారంలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు. హైదరాబాద్ అమీర్‌పేట్ మోతీ నగర్ కి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి రామరాజును పలుమార్లు ఇన్సూరెన్స్ చేసుకోవాలని ఒత్తిడి చేసిన చీటర్స్. దీంతో వారు చెప్పిన విధంగా విడతల వారిగా 3.5 కోట్ల రూపాయలు చెల్లించి ఇన్సూరెన్స్ (Insurance) తీసుకున్న రామరాజు. ఇక అమెరికాలో ఉన్న రామరాజు కొడుకు ఇన్సూరెన్స్ పత్రాలను చెక్ చేయగా, అవి నకిలీ అని తేలడంతో.. మోసపోయామని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు రామరాజు.
ఈ వ్యవహారంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు పోలీసులు. కేవలం మూడు రోజుల్లోనే కేసును ఛేదించి నిందితుల అరెస్ట్ చేశారు. కరీంనగర్‌కు చెందిన మనోజ్, వనపర్తికి చెందిన మహేష్ గౌడ్, గుడివాడకు చెందిన సుబ్రహ్మణ్యంలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలింపు.
జాగ్రత్తగా ఉండాలి..
ఇలాంటి వ్యవహారాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఫోన్ ద్వారా ఎలాంటి వ్యవహారాలకు అంగీకారం తెలుపవద్దని, ఇన్సూరెన్స్ చేసుకోవాలంటే పేరున్న కంపెనీలను ఎంచుకుని నేరుగా కార్యాలయాలకు వెళ్లి చేసుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా మీ ఇంటి వద్దకు వచ్చి ఇన్సూరెన్స్ చేసుకోవాలని కోరినా.. పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే స్పందించాలని, లేకపోతే నిలువునా మోసపోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి: