Viral: పెద్ద సూట్‌కేసుతో హోటల్ నుంచి బయటకు.. అనుమానంతో చెక్ చేస్తే.. కళ్లుచెదిరే సీన్
ఉత్తరాఖండ్ రూడ్కీ జిల్లా పిరాన్ కలియార్ ప్రాంతంలో గురువారం రాత్రి దారుణ ఘటన జరిగింది. పెళ్లి రిజెక్ట్ చేసిందనే కోపంతో లవర్‌ను హెటల్‌కి తీసుకెళ్లి అత్యంత దారుణంగా చంపేశాడు ఓ వ్యక్తి.
Uttarakhand:ఉత్తరాఖండ్ రూడ్కీ జిల్లా పిరాన్ కలియార్ ప్రాంతంలో గురువారం రాత్రి దారుణ ఘటన జరిగింది. పెళ్లి రిజెక్ట్ చేసిందనే కోపంతో లవర్‌ను హెటల్‌కి తీసుకెళ్లి అత్యంత దారుణంగా చంపేశాడు ఓ వ్యక్తి. ఆపై శవాన్ని మాయం చేసేందుకు పక్కా ప్లాన్ వేశాడు. సూట్‌కేసులో కుక్కి నదిలో పడేసేందుకు ట్రై చేశాడు. అయితే హోటల్ సిబ్బంది అతడిని పట్టేసుకున్నారు. అయితే వారికి ఆమె సూసైడ్ చేసుకుంది అంటూ కొత్త కథ చెప్పాడు. ఈ క్రమంలో పోలీసులు రంగంలోకి దిగగా… అసలు విషయం వెలుగుచూసింది. పక్కా ప్లాన్‌తో అతడు ఈ హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. వివరాల్లోకి వెళ్తే.. మంగళూరుకు చెందిన రమ్శా అనే యువతిని.. ఆమె దూరపు బంధువైన సనవార్ యువకుడు లవ్ చేశాడు ఇరువురు కలిసి గురువారం రాత్రి పిరాన్ కలియార్ ఏరియాలోని ఓ హోటల్‌కు వచ్చారు. కొంత సమయం తర్వాత పెద్ద సూట్‌కేసుతో హోటల్ నుంచి బయటకు వెళ్లేందుకు ట్రై చేశాడు. అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన హోటల్ స్టాఫ్, స్థానికులు యువకుడిని పట్టుకున్నారు. సూట్‌కేసు తెరిచి చూడగా యువతి డెడ్‌బాడీ ఉండటంతో అందరూ షాక్ తిన్నారు. ఈ క్రమంలో తాము సూసైడ్ చేసుకునేందుకే హోటల్‌కు వచ్చామని, ముందుగా తన ప్రేయసి విషం తాగి చనిపోయిందని అతడు కట్టుకథ అల్లాడు. తన మృతదేహాన్ని నదిలో పడేసి ఆ తర్వాత తానూ సూసైడ్ చేసుకునేందుకు ప్లాన్ చేసుకున్నామని చెప్పాడు. అనుమానపడిన సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ప్రియుడిని అదుపులోకి తీసుకుని డెడ్‌బాడీని పోస్ట్‌మార్టానికి తరలించారు.
అతడు తికమకగా ఆన్సర్స్ చెప్పడంతో.. పోలీసులు తమదైన శైలిలో విచారించారు. దీంతో తానే మర్డర్ చేశానని, ఆత్మహత్య బూటకమని ఒప్పుకున్నాడు. తమ పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు నో చెప్పారని, వారి మాటకే కట్టుబడి ఉంటానని తనను దూరం పెట్టిందని వెల్లడించాడు. దీంతో కోపం పెంచుకున్న సనవార్.. హత్యకు పక్కా ప్లాన్ వేశాడు. ముందుగానే ఓ సూట్‌కేసును కొన్నాడు. యువతి పేరు రమ్శా కాకుండా కాజల్ పేరుతో ఐడీ కార్డు చూపించి హోటల్లో రూమ్ తీసుకున్నాడు. రాత్రి హోటల్‌కు తీసుకెళ్లి హత్య చేసి.. సూట్ కేసులో కుక్కి పడేసేందుకు ప్రయత్నించి దొరికిపోయాడు.
గమనిక: దిగువ వీడియోలోని దృశ్యాలు మిమ్మల్ని కలచివేయవచ్చు
Ayaan caught with his partner packed in a suitcase…
Caught in Piran Kaliyar, Uttrakhand pic.twitter.com/mXva9Jkp3c
— INFERNO (@TheAngryLord) March 25, 2022
Also Read: ఏప్రిల్ నుంచి హైదరాబాద్‌లో కొత్త ట్రాఫిక్ రూల్స్.. అలా చేస్తే డైరెక్ట్ జైలుకే
బెజవాడ అన్నపూర్ణ థియేటర్‌లో ఇది పరిస్థితి.. ఎక్కడ తేడా కొట్టిందంటే…?