Lord Shiva in Court: ప్రభుత్వభూమి కబ్జా కేసులలో విచారణకు హాజరైన “పరమశివుడు”..!

చేసిన తప్పులను మన్నించాలంటూ ప్రాయిశ్చితం కోసం దేవుడిని ప్రార్థిస్తుంటారు. అటువంటిది.. మనుషులు చేసే తప్పుల్లో దేవుడికే పాత్ర ఉంటే.. ఆ దేవుడు కూడా కోర్టు ముందు దోషిగా నిలబడితే ఇక దిక్కెవరు.

Lord Shiva in Court: ప్రభుత్వభూమి కబ్జా కేసులలో విచారణకు హాజరైన “పరమశివుడు”..!
Lord Shiva Presented In Court
Follow us

|

Updated on: Mar 26, 2022 | 7:05 AM

Chhattisgarh in an Unique Case: చేసిన తప్పులను మన్నించాలంటూ ప్రాయిశ్చితం కోసం దేవుడిని ప్రార్థిస్తుంటారు. అటువంటిది.. మనుషులు చేసే తప్పుల్లో దేవుడికే పాత్ర ఉంటే.. ఆ దేవుడు కూడా కోర్టు ముందు దోషిగా నిలబడితే ఇక దిక్కెవరు. ప్రభుత్వ భూమిని కబ్జాచేశారంటూ సాక్షాత్తు పరమశివుడి(Lord Shiva)నే కోర్టుకు ఈడ్చారు కొందరు దుర్మర్గులు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లా(Raigarh District)లో చోటుచేసుకుంది ఈ ఘటన. మార్చి 25న జరిగే విచారణకు హాజరు కావాలంటూ శివుడినే ఆదేశించింది కోర్టు. రాయ్‌గఢ్‌ జిల్లా 25వ వార్డు పరిధిలో ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనదంటూ సుధా రజ్వాడే బిలాస్‌పుర్‌ హైకోర్టులో ఓ పిటిషన్‌ వేశారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించిన కొందరు వ్యక్తులు అక్కడ ఆలయాన్ని నిర్మించారని పిటిషన్ లో పేర్కొన్నారు. పిటిషన్లో శివాలయం సహా మరో 16 మందిని నిందితులుగా పేర్కొన్నారు. దీంతో విచారణ కోసం ప్రత్యేక కమిటీ వేసిన కోర్టు.. పరమ శివుడితో సహా నిందితులందరూ హాజరు కావాలని ఆదేశించారు.

కోర్డు ఆదేశాల మేరకు తహశీల్దార్ కార్యాలయంలో పరమ శివుడితో సహా పాటు పలువురు వ్యక్తులు విచారణకు హాజరయ్యారు. అయితే, శివుడు కూడా మరోసారి రావల్సి ఉంటుందని తదుపరి తేదీని ఇచ్చారు తహశీల్దార్. ఎందుకంటే ప్రిసైడింగ్ అధికారులు ఇతర ప్రభుత్వ పనుల్లో బిజీగా ఉన్నారు. వినడానికి ఇది హాస్యాస్పదంగా అనిపించవచ్చు. కానీ ఇది వాస్తవం. ఈ విషయం రాయ్‌గఢ్ మున్సిపల్ కార్పొరేషన్ వార్డు నంబర్ 25 పరిధిలోని కౌహకుంద ప్రాంతంలో జరిగింది. వాస్తవానికి, శివాలయంతో సహా 16 మంది ప్రభుత్వ భూమి, చెరువును ఆక్రమించారని ఆరోపిస్తూ వార్డు నంబర్ 25కి చెందిన సుధా రాజ్‌వాడే బిలాస్‌పూర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది.

ఈ కేసుకు సంబంధించి విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, తహసీల్దార్‌ కార్యాలయాన్ని కోర్టు ఆదేశించింది. తహసీల్దార్ కార్యాలయ అధికారి విచారణ బృందంగా ఏర్పడి 3 రోజుల పాటు విచారణ చేపట్టారు. విచారణలో 10 మందిపై భూమి, చెరువు కబ్జాలు ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత నాయబ్ తహసీల్దార్ రాయ్‌ఘర్ శివుడి పేరు ఉన్న ప్రభుత్వ భూమి, చెరువు కబ్జాకు సంబంధించి 10 మందికి నోటీసు జారీ చేశారు. అంతేకాదు, విచారణకు హాజరుకాని పక్షంలో శివుడు సహా ప్రతి ఒక్కరికీ 10 వేల జరిమానా విధించారు. స్వాధీనం చేసుకున్న భూమిని వెంటనే ఖాళీ చేయాలని తహసీల్ కార్యాలయం నోటీసులో హెచ్చరించింది. 10 మంది కబ్జాదారులకు నాయబ్ తహసీల్దార్ జారీ చేసిన నోటీసులో, శివాలయం పేరు ఆరవ స్థానంలో ఉందని, ఈ శివుడినే ముద్దాయిగా చేర్చారు.

ఈ నోటీసు ఆలయ ధర్మకర్త, మేనేజర్, పూజారికి కాదని, నేరుగా శివునికి జారీ చేయడం విడ్డూరం. కాగా, శివాలయంలోని శివలింగానికి సంబంధించి వార్డు కౌన్సిలర్ సప్నా సిదార్‌తో సహా డజన్ల కొద్దీ ప్రజలు ఆలయానికి చేరుకున్నారు. అయితే పీఠాధిపతి కొన్ని ప్రభుత్వ పనిలో బిజీగా ఉన్నారని తహసీల్దార్ ఛాంబర్ వెలుపల సమాచారం పోస్ట్ చేశారు. తదుపరి విచారణ తేదీ ఇప్పుడు 13 ఏప్రిల్ 2022న ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

Read Also…. Gold And Silver Price: మరోసారి షాకిచ్చిన గోల్డ్‌, సిల్వర్ రేట్స్‌.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ఎంత పెరిగిందంటే..

మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..