Shanidev: శనిదేవుడి అనుగ్రహం లభించాలంటే శనివారం ఇలా పూజించండి..!

Shanidev: జ్యోతిష్యం ప్రకారం ఏప్రిల్‌లో శనిదేవుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ పరిస్థితిలో శని ప్రభావం అన్ని రాశుల మీద ఉంటుంది. అందుకే శనివారం కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా

Shanidev: శనిదేవుడి అనుగ్రహం లభించాలంటే శనివారం ఇలా పూజించండి..!
Shanidev
Follow us
uppula Raju

|

Updated on: Mar 26, 2022 | 5:49 AM

Shanidev: జ్యోతిష్యం ప్రకారం ఏప్రిల్‌లో శనిదేవుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ పరిస్థితిలో శని ప్రభావం అన్ని రాశుల మీద ఉంటుంది. అందుకే శనివారం కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా శని ఉగ్రతను తగ్గించవచ్చు. శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.శని యంత్రాన్ని పూజించడం వల్ల శని దోషం నుంచి బయటపడవచ్చు. ఇందుకోసం శనివారం తలస్నానం చేసిన శుభ్రమైన నల్లని దుస్తులు ధరించాలి. తర్వాత భక్తి శ్రద్ధలతో శని దేవుడిని ఆరాధించాలి. వీలైతే శని యంత్రాన్ని పూజించాలి. ఇలా చేయడం వల్ల ఉద్యోగ, వ్యాపార, ధనానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. శాస్త్రాల ప్రకారం శివుడు శనికి గురువు. అందుకే శనివారం శివుని పూజించడం వల్ల శని దేవుడి అనుగ్రహం లభిస్తుంది. అంతే కాకుండా శనివారం హనుమంతుని ఆరాధనకు ప్రత్యేకంగా భావిస్తారు. హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా శని బాధ నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. అలాగే జీవితంలో పురోగతికి మార్గం సులభమవుతుంది.

శనివారాల్లో నువ్వులు లేదా ఆవాల నూనెను దానం చేయడం వల్ల శనిగ్రహ ఉగ్రత తగ్గించవచ్చు. అలాగే నల్ల కుక్కకు శనివారం ఆవనూనె తినిపించడం వల్ల సంపద పెరుగుతుంది. అంతే కాకుండా శనివారం శని ఆలయంలో ఆవనూనె దీపం వెలిగించడం ద్వారా శని దోషం తొలగిపోతుంది. పేద, నిస్సహాయ లేదా ఆపదలో ఉన్న వ్యక్తికి సాయం చేస్తే శనిదేవుడు ఆశీస్సులు లభిస్తాయి.

శనిదేవుడు తొమ్మిది గ్రహాలలో ఒకడు. సాధారణంగా శనిదేవుడిని కర్మను ఇచ్చేవాడు అంటారు. శని దేవుడి స్వభావం చాలా కోపంగా ఉంటుంది. అతడి రంగు నల్లగా ఉంటుంది. ఆలయాలలో కూడా శని దేవుడి విగ్రహం నలుపు రంగులోనే ఉంటుంది. శని దేవుడికి ఇష్టమైన రంగు కూడా నలుపే. నల్లటి నువ్వులు, నల్లటి దుస్తులు, నల్లటి వస్తువులు అతడికి సమర్పిస్తారు. దీంతో అతడు సంతోషించి తన భక్తులకు ఆశీర్వాదం అందజేస్తాడని నమ్మకం.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, జ్యోతిష్యంపై ఆధారపడి ఉంటుంది. సాధారణ పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని రాయడం జరిగింది.

Earthquake: అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రత

Oily Skin: ఆయిల్‌ స్కిన్‌ ఉన్నవారు వీటిని అప్లై చేయకూడదు.. ఎందుకో తెలుసుకోండి..!

IPL 2022: ఐపీఎల్‌లో ఇప్పటివరకు అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్లు వీరే..!