Health Tips: ‘జీలకర్ర’ను ఈ సమయంలో తింటే సంపూర్ణ ఆరోగ్యం మీసోంతం.. పూర్తి వివరాలు మీకోసం..

Health Tips: మనం రోజూ తినే వంటకాల్లో జీలకర్రను తప్పకుండా వినియోగిస్తారు. మసాలా దినుసుల్లో భాగమైన ఈ జీలకర్రను రెగ్యూలర్‌గా తీసుకుంటే..

Health Tips: ‘జీలకర్ర’ను ఈ సమయంలో తింటే సంపూర్ణ ఆరోగ్యం మీసోంతం.. పూర్తి వివరాలు మీకోసం..
Cumin
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 26, 2022 | 7:30 AM

Health Tips: మనం రోజూ తినే వంటకాల్లో జీలకర్రను తప్పకుండా వినియోగిస్తారు. మసాలా దినుసుల్లో భాగమైన ఈ జీలకర్రను రెగ్యూలర్‌గా తీసుకుంటే.. అనేక ఆరోగ్య సమస్యలు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జీలకర్రలో ఉండే క్రిమినాశక గుణాలు.. గాయాలను నయం చేయడంలో, జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. జీలకర్రను సరైన మోతాదులో తీసుకుంటే.. ఉదర సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. దాంతో పాటు.. శరీరంలో ఉన్న టాక్సిన్స్‌ను బయటకు పంపించేస్తుంది. జీలకర్రలోని యాంటీ-కార్సినోజెనిక్ లక్షణాలు.. ఉదరం, కాలేయంలో ఏర్పడే ట్యూమర్‌ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అందుకే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే జీలకర్రను తినాలని సూచిస్తున్నారు నిపుణులు. వంటలో కంటే.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో జీలకర్ర నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో జీలకర్ర నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.. ప్రతి రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో జీలకర్ర నీటిని తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రస్తుత కరోనా కాలంలో చాలా మంది ఔషధ గుణాలు కలిగిన మూలికల కషాయాలను తయారుచేసుకుని తాగుతున్నారు. కారణం.. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఉద్దేశ్యం. అయితే, మూలికలతో పాటు జీలకర్రతో చేసిన నీటిని తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

జ్ఞాపకశక్తిని పెంచుతుంది.. మతి మరుపు సమస్యను జీలకర్ర దూరం చేస్తుంది. ఉదయాన్ని ఖాళీ కడుపుతో జీలకర్ర తినడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. జీలకర్రలోని మూలకాలు నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. జీలకర్ర మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. దానిలోని యాంటీఆక్సిడెంట్లు మెదడు కణాలకు మెరుగైన పోషణను అందించడానికి సహాయపడుతాయి. ఇందుకోసం జీలకర్ర గింజలను రాత్రి నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగాలి. ఆ తరువాత నానబెట్టిన జీలకర్రను తినాలి.

మొటిమల సమస్యను నివారిస్తుంది.. జీలకర్రలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మానికి సంబంధించిన సమస్యలకు చెక్ పెడుతుంది. తరచుగా మొటిమలు మిమ్మల్ని వేధిస్తు్న్నట్లయితే.. ప్రతి రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో జీలకర్ర నీటిని తాగాలి. రాంగ్ డైట్ వల్ల కలిగే ప్రభావం ఆరోగ్యంపైనే కాకుండా చర్మంపైనా చూపుతుంది. ఈ కారణంగా మొటిమలు వస్తాయి. అయితే, జీలకర్రను ఉదయాన్నే తినడం వలన.. అందులోని యాంటీ బాక్టీరియల్ మూలకాలు.. మొటిమలు రాకుండా అడ్డుకుంటాయి.

Also read:

Optical Illusion: మీ కళ్లకు అగ్నిపరీక్ష.. ఈ ఫోటోలో ఎంత మంది ఉన్నారో చెబితే మీరే జీనియస్..!

Viral Video: చేసిందంతా చేసి కుక్కను బలి చేసిన కంత్రీ పిల్లి.. వీడియో చూస్తే అవాక్కవుతారు..!

Astrology: వ్యక్తి ఎత్తును బట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చు.. అదెలాగో ఇప్పుడే తెలుసుకోండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!