AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ration Aadhar Linking: గుడ్‌న్యూస్‌.. రేషన్ కార్డుకు ఆధార్ అనుసంధానం గడువు పొడిగింపు

Ration Aadhar Linking: రేషన్‌కార్డు వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌ కార్డ్‌ (ONORC) విధానాన్ని 2019 ఆగస్టులో ప్రారంభించింది..

Ration Aadhar Linking: గుడ్‌న్యూస్‌.. రేషన్ కార్డుకు ఆధార్ అనుసంధానం గడువు పొడిగింపు
Ration Aadhar Linking
Subhash Goud
|

Updated on: Mar 25, 2022 | 2:55 PM

Share

Ration Aadhar Linking: రేషన్‌కార్డు వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌ కార్డ్‌ (ONORC) విధానాన్ని 2019 ఆగస్టులో ప్రారంభించింది. ప్రతి ఒక్కరికి రేషన్‌ సరుకులు అందేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో రేషన్‌ కార్డు (Ration Card)కు ఆధార్‌ నంబర్‌ను అనుసంధానం చేయడం తప్పనిసరి. ఈ అనుసంధానం మార్చి 31 వరకు గడువు ఉండేది. దానిని కేంద్ర ప్రభుత్వం జూన్‌ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్రం నిర్ణయంతో ఆధార్‌ అనుసంధానం చేయని వారికి ఊరట కల్పించినట్లయ్యింది. ముఖ్యంగా జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం..ప్రజలు పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుంటారు. అలాంటి సమయంలో వారు రేషన్‌ సరుకులను పొందాలంటే ఇబ్బంది మారేంది. కేంద్ర ప్రభుత్వం దేశంలో ఒక్కడైన రేషన్‌ సరుకులు తీసుకోవచ్చని, అందుకు రేషన్‌ కార్డుతో ఆధార్‌ నంబర్‌ను అనుసంధానం చేయడం తప్పనిసరి చేసింది.

కేంద్ర నిర్ణయంతో దేశంలోని రేషన్‌కార్డు లబ్ధిదారుకుల పెద్ద ఉపశమనం కలిగించినట్లయ్యింది. దీంతో జూన్ 30 వరకు కార్డుదారులు రేషన్ సరఫరాలను పొందడంతో పాటు ఇతర పధకాలను, ప్రభుత్వ సౌకర్యాలను పొందుతారని ప్రభుత్వం వెల్లడించింది. అంతకుముందు చివరి తేదీని మార్చి 31, 2022గా నిర్ణయించారు. ప్రస్తుతం చివరి తేదీని సవరించడంతో 2022 జూన్ 30 నాటికి లబ్ధిదారులు తమ రేషన్ కార్డులను ఆధార్ లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘ఒకటే దేశం ఒకటే రేషన్ కార్డు’ పథకాన్ని కూడా ప్రారంభించింది. దింతో ఒక ప్రాంతానికి చెందిన రేషన్ కార్డుదారులు దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వం అందించే రేషన్ సరుకులను పొందవచ్చు. వీటితో పాటుగా కేంద్రం అందించే అనేక పధకాలను రేషన్ కార్డుదారులు పొందుతున్నారు. ఈ పథకం కింద 80 కోట్ల లబ్దిదారులున్నారు. ఫిబ్రవరి మధ్య నాటికి వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌ కార్డ్‌ కింద 96 శాతం మంది లబ్దిదారులు నమోదు చేసుకున్నారు.

ఆన్‌లైన్‌లో రేషన్ కార్డును ఆధార్ తో లింక్ చేయడం:

రేషన్ కార్డు ఆధార్‌తో అనుసంధానించాలనుకునేవారు.. ఆధార్ అధికారిక వెబ్ సైట్ uidai.gov.in ద్వారా సులభంగా చేసుకోవచ్చు. ఇక్కడ ‘స్టార్ట్ నౌ’ మీద క్లిక్ చేయండి. జిల్లా, రాష్ట్రం పేరుతో సహా మీ చిరునామా వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ‘రేషన్ కార్డు బెనిఫిట్’ ఆప్షన్ పై క్లిక్ చేయండి. మీ ఆధార్ నెంబరు, రేషన్ కార్డు నెంబరు, ఇమెయిల్ చిరునామా, మొబైల్ నెంబరు ఎంటర్ చేయండి. ఈ విధంగా చేసిన తరువాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరుకు ఓటిపి వస్తుంది. మీరు OTPని ఎంటర్ చేసినప్పుడు, మీ స్క్రీన్ మీద ప్రాసెస్ కంప్లీషన్ అనే సందేశం వస్తుంది. మొత్తం ప్రక్రియ పూర్తయిన వెంటనే మీ ఆధార్ వెరిఫై చేయబడుతుంది.

ఆఫ్‌లైన్‌లో లింక్‌ చేసుకోవడం ఎలా..?

రేషన్‌ కార్డుకు ఆధార్‌ లింక్‌ ఆఫ్‌లైన్‌లో కూడా చేసుకోవచ్చు. ఇందుకోసం అవసరమైన పత్రాలను రేషన్ కేంద్రంలో సమర్పించాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్లలో ఆధార్ కాపీ, రేషన్ కార్డు కాపీ, రేషన్ కార్డు హోల్డర్ పాస్ పోర్ట్ సైజు ఫోటోలు అందించాలి. మీ ఆధార్ బయోమెట్రిక్ డేటా వెరిఫికేషన్ కూడా రేషన్ కార్డు కేంద్రంలో చేయవచ్చు. ఈ విధానాల ద్వారా రేషన్‌ కార్డుతో ఆధార్‌ లింక్‌ చేసుకునే సదుపాయం ఉంది. అయితే జూన్‌ 30లోగా అనుసంధానం చేయకపోతే రేషన్‌ నిలిచిపోయే అవకాశం ఉంది. సో.. ఆధార్‌ అనుసంధానం చేయని వారు త్వరగా ఈ పని పూర్తి చేసుకోవడం బెటర్‌.

ఇవి కూడా చదవండి:

April Bank Holidays: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌.. ఏప్రిల్‌లో బ్యాంకులకు వరుస సెలవులు

LIC Policy Holders: ఎల్‌ఐసీలో అలాంటి పాలసీదారులకు గుడ్‌న్యూస్‌.. మార్చి 25 చివరి తేదీ