KTR: చివరి రోజు భారీ పెట్టుబడుల ప్రవాహం.. అమెరికాలో ముగిసిన మంత్రి కేటీఆర్ పర్యటన

KTR: తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అమెరికా పర్యటన(KTR US Tour) ముగిసింది. చివరి రోజు తెలంగాణలో పెట్టుబడి పెట్టనున్నట్లు 4 సంస్థలు ప్రకటించాయి. దీంతో హైదరాబాదా ఫార్మా రంగానికి కొత్త పెట్టుబడులు, ఉద్యోగాలు రానున్నాయి.

KTR: చివరి రోజు భారీ పెట్టుబడుల ప్రవాహం.. అమెరికాలో ముగిసిన మంత్రి కేటీఆర్ పర్యటన
Ktr Us Tour
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Mar 27, 2022 | 12:39 PM

KTR: తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అమెరికా పర్యటన(KTR US Tour) విజయవంతంగా ముగిసింది. చివరి రోజు తెలంగాణలో పెట్టుబడి పెట్టనున్నట్లు 4 సంస్థలు ప్రకటించాయి. భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన లైఫ్ సైన్సెస్, ఫార్మా కంపెనీలు ముందుకొచ్చాయి. కేటీఆర్ తో సమావేశం అనంతరం తమ నిర్ణయాలు కంపెనీలు వెల్లడించాయి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఆర్ఏ కెమ్ ఫార్మా లిమిటెడ్ (RA Chem Pharma Ltd), అవ్రా ల్యాబొరేటరీస్ (Avra Laboratories) లో రూ.1,750 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అడ్వెంట్ ఇంటర్నేషనల్ కంపెనీ ముందుకొచ్చింది. లైఫ్ సైన్సెస్ రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత, కల్పిస్తున్న మౌలిక వసతులు తమ విస్తరణ, ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడతాయని ఆ కంపెనీ తెలిపింది.

న్యూజెర్సీ కేంద్రంగా పని చేస్తున్న స్లేబ్యాక్ ఫార్మా హైదరాబాద్ ఫార్మాలో సుమారు రూ. 150 కోట్లు(USD 20 million) పెట్టుబడితో విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. ఈ మెుత్తన్ని రానున్న మూడు సంవత్సరాల్లో పెట్టుబడిగా పెట్టనున్నట్లు కంపెనీ వెల్లడించింది. తమ కంపెనీ గతంలో హైదరాబాద్ ఫార్మా రంగంలో రూ.2,300 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు స్లే బ్యాక్ ఫార్మా వ్యవస్థాపకులు, సీఈఓ అజయ్ సింగ్ మంత్రి కేటీఆర్‌కు వివరించారు.

అమెరికాకు చెందిన మరో ఫార్మా సంస్థ యునైటెడ్ స్టేట్స్ ఫార్మాకొపియా రెండు లక్షల డాలర్ల అదనపు మూలధన పెట్టుబడితో నిరంతర ఔషధ తయారీ (ఫ్లో కెమిస్ట్రీ) కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే అడ్వాన్స్‌డ్‌ ల్యాబ్‌లో 50 మంది అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తల బృందం పని చేస్తుందని కంపెనీ ప్రతినిధులు కేటీఆర్‌కు వెల్లడించారు. 12,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో జీనోమ్ వ్యాలీలో తాము ఏర్పాటు చేసే ఈ అత్యాధునిక ల్యాబ్‌కు సింథటిక్, విశ్లేషణాత్మక సామర్థ్యం ఉన్నయని పేర్కొన్నారు. 200 మంది ఐటీ నిపుణులతో కూడిన బలమైన వర్క్ ఫోర్స్‌తో హైదరాబాద్‌లో తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుట్లు స్ప్రింక్లర్ కంపెనీ బృందం మంత్రికి తెలియజేసింది.

న్యూయార్క్ కేంద్రంగా ఉన్న క్యూరియా గ్లోబల్ (ఇంతకు ముందు AMRI Global ) హైదరాబాద్ లోని తన కేంద్రంలో పనిచేసే ఉద్యోగులను రాబోయే 12 నెలల్లో రెట్టింపు చేసే ఆలోచనలో ఉంది. క్యూరియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ప్రకాష్ పాండియన్ తో మంత్రి కే. తారకరామారావు సమావేశం తరువాత కంపెనీ ఈ ప్రకటన చేసింది. మార్కెట్ లీడ్స్, సప్లై ఛైయిన్ సర్వీసెస్, బిజినెస్ ఎనాలిసిస్, లీగల్ సపోర్ట్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, కన్సల్టెన్సీ సంబంధిత సర్వీసులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైనాన్స్, అకౌంటింగ్, క్వాలిటీ, రెగ్యులేటరీ, కమర్షియల్ సర్వీసెస్, ప్రొక్యూర్ మెంట్, హ్యూమన్ రిసోర్సెస్, కస్టమర్ సర్వీస్, మార్కెటింగ్ & సేల్స్, ట్రైనింగ్, డేటా మెయింటెనెన్స్ సర్వీసెస్, ఎన్విరాన్ మెంట్, హెల్త్ & సేఫ్టీ (ఈహెచ్ ఎస్) వంటి రంగాల్లోని అన్ని క్యూరియా గ్రూపు సంస్థలకు సపోర్ట్ సర్వీస్ అందించడానికి గత ఏడాది హైదరాబాద్ లో గ్లోబల్ షేర్డ్ సర్వీస్ సెంటర్ ను ఏర్పాటుచేసినట్టు మంత్రికి ఈ సమావేశంలో తెలియజేశారు. హైదరాబాద్ లోని గ్లోబల్ షేర్డ్ సర్వీస్ సెంటర్ లో ప్రస్తుతం 115 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, రాబోయే 12 నెలల్లో మరో 100 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రకాష్ పాండియన్ తెలిపారు.

ఇవీ చదవండి..

The Kashmir Files: అంచనాలను తలకిందులు చేసిన చిన్న సినిమా.. రికార్డులు క్రియేట్ చేస్తున్న కాశ్మీర్ ఫైల్స్

Yatra IPO: మార్కెట్లోకి మరో ఐపీవో.. రూ.750 కోట్ల మెగా ఇష్యూకు సిద్ధమౌతున్న ట్రావెల్ కంపెనీ..