AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Kashmir Files: అంచనాలను తలకిందులు చేసిన చిన్న సినిమా.. రికార్డులు క్రియేట్ చేస్తున్న కాశ్మీర్ ఫైల్స్

ప్రేక్షకులు ఏ సినిమాను ఆదరిస్తారు... ఏ సినిమాను రిజెక్ట్ చేస్తారు.. అన్నది ఎవరూ చెప్పలేరు. భారీ అంచనాల మధ్య ఆడియన్స్‌ ముందుకు వచ్చిన సినిమాలు కూడా కొన్నిసార్లు బోర్లా పడతాయి.

The Kashmir Files: అంచనాలను తలకిందులు చేసిన చిన్న సినిమా.. రికార్డులు క్రియేట్ చేస్తున్న కాశ్మీర్ ఫైల్స్
The Kashmir Files
Rajeev Rayala
|

Updated on: Mar 27, 2022 | 12:00 PM

Share

The Kashmir Files: ప్రేక్షకులు ఏ సినిమాను ఆదరిస్తారు.. ఏ సినిమాను రిజెక్ట్ చేస్తారు.. అన్నది ఎవరూ చెప్పలేరు. భారీ అంచనాల మధ్య ఆడియన్స్‌ ముందుకు వచ్చిన సినిమాలు కూడా కొన్నిసార్లు బోర్లా పడతాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన చిన్న సినిమాలు సంచలనాలు నమోదు చేస్తుంటాయి. రీసెంట్‌గా అలాంటి రేర్‌ ఫీట్‌ను రికార్డ్ చేసింది ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌. రాధేశ్యామ్‌.. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన వరల్డ్ క్లాస్ లవ్ స్టోరి. లైలా మజ్ను, సలీం అనార్కలీ, దేవదాస్ లాంటి అమర ప్రేమకథల సరసన నిలిచే అద్భుత ప్రణయ కావ్యం అంటూ ముందు నుంచే ఈ సినిమా మీద భారీ హైప్‌ క్రియేట్ అయ్యింది. కానీ ఆఫ్టర్ రిలీజ్‌ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఇండియన్ సిల్వర్‌ స్క్రీన్‌ను రివైవ్ చేస్తుందనుకున్న రాధేశ్యామ్ నిరాశపరిచింది. భల్లాల దేవుడ్ని డీకొట్టిన బాహుబలిని… ప్రేరణ వెంటపడే విక్రమాదిత్యగా చూడలేకపోయారు ఆడియన్స్‌. అందుకే హార్ట్ టచింగ్ స్టోరీ… గ్రాండ్ విజువల్స్‌తో మెస్మరైజ్‌ చేసినా రిజల్ట్ మాత్రం తేడాకొట్టేసింది.

రాధేశ్యామ్‌ రిలీజ్ అయిన సేమ్ డేట్‌కి ఎలాంటి అంచనాలు లేకుండా ఓ చిన్న సినిమా ఇండియన్ మూవీ లవర్స్‌ను పలకరించింది. 90స్‌లో జరిగిన కొన్ని అమానవీయ ఘటనల నేపథ్యంలో తెరకెక్కిన కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాకు ఆడియన్స్‌ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. కశ్మీరీ పండిట్లపై జరిగిన దాడులు.. వాటి పర్యవసానాల నేపథ్యంలో తెరకెక్కిన ది కశ్మీర్ ఫైల్స్‌… సంచనల విజయం సాధించింది. 10 కోట్ల కన్నా తక్కువ బడ్జెట్‌తో ఎలాంటి స్టార్ కాస్టింగ్ లేకుండా తెరకెక్కిన కశ్మీర్ ఫైల్స్‌.. తొలి వారంలోనే వంద కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఆడియన్స్‌ పల్స్ పట్టుకోవటం ఎలా అన్న విషయంపై మరోసారి చర్చ మొదలైంది.  దాంతో ఈ సినిమా స్పూర్తితో మరొకొన్ని రియల్ స్టోరీస్ తెరపైకి రావడానికి రెడీ అవుతున్నాయని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Shahrukh Khan: 56 ఏళ్ల వయసులో 8 ప్యాక్స్‌.. ‘పఠాన్’ లుక్స్‌కి అభిమానులు ఫిదా..!

RRR Movie: ఆర్ఆర్ఆర్‏కు అక్కడ నిరాశేనా.. ముఖం చాటేస్తోన్న ప్రేక్షకులు.. ఎందుకంటే..

Sai Dharam Tej: యాక్సిడెంట్‌ తర్వాత సాయిధరమ్‌ తేజ్‌ మొదటి వీడియో.. ఆరోజు గుడ్‌న్యూస్‌ చెబుతానంటూ..