AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR Movie: ట్రిపులార్‌ సక్సెస్‌పై తనదైన స్టైల్‌లో స్పందించిన రామ్‌గోపాల్‌ వర్మ.. ఏమన్నరాంటే..

RRR Movie: ఇండియన్‌ సినిమా రికార్డులను తిరగరాస్తూ దూసుకుపోతోంది ఆర్‌.ఆర్‌.ఆర్‌. రాజమౌళి (Rajamouli) దర్శకత్వ ప్రతిభ, ఎన్టీఆర్‌ (NTR), రామ్‌ చరణ్‌ల (Ram Charan) అద్భుత నటన సినిమాను విజయతీరాలకు తీసుకెళ్లింది. ప్రస్తుతం...

RRR Movie: ట్రిపులార్‌ సక్సెస్‌పై తనదైన స్టైల్‌లో స్పందించిన రామ్‌గోపాల్‌ వర్మ.. ఏమన్నరాంటే..
Narender Vaitla
|

Updated on: Mar 27, 2022 | 12:06 PM

Share

RRR Movie: ఇండియన్‌ సినిమా రికార్డులను తిరగరాస్తూ దూసుకుపోతోంది ఆర్‌.ఆర్‌.ఆర్‌. రాజమౌళి (Rajamouli) దర్శకత్వ ప్రతిభ, ఎన్టీఆర్‌ (NTR), రామ్‌ చరణ్‌ల (Ram Charan) అద్భుత నటన సినిమాను విజయతీరాలకు తీసుకెళ్లింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్‌.ఆర్‌.ఆర్‌ హవా నడుస్తోంది. విడుదలైన అన్ని చోట్ల భారీ కలెక్షన్లను రాబడుతోంది. సినిమా విజయం పట్ల అభిమానులతో పాటు సెలబ్రిటీలు సైతం స్పందిస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా ట్రిపులార్‌ చిత్రంపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌తో పాటు పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీలు సైతం ఆర్‌.ఆర్‌.ఆర్ సినిమాను పొగుడుతూ పోస్టులు చేస్తున్నారు.

తాజాగా ఈ జాబితాలోకి సంచనల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ కూడా వచ్చారు. ప్రతీ అంశంపై అందరిలా కాకుండా కాస్త వెరైటీగా స్పందించే రామ్‌గోపాల్‌ వర్మ ట్రిపులార్‌ సినిమా విషయంలో మాత్రం అందరిలాగే స్పందించడం విశేషం. ట్రిపులార్‌ సినిమాను ప్రశంసిస్తూ వర్మ పోస్ట్‌ చేయడంతో ఇప్పుడు ఈ ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షించింది. బాహుబలితో చిత్రంలో పోల్చుతూ వర్మ చేసిన పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఈ విషయమై రామ్‌ గోపాల్‌ వర్మ ట్వీట్ చేస్తూ.. ‘బాహుబలి – 2 అనేది చరిత్ర అయితే, ఆర్‌ఆర్‌ఆర్‌ అనేది చారిత్రాత్మకం. రాజమౌళి బాక్సాఫీస్‌కు మోక్షం కల్పించిన గొప్ప వ్యక్తి’ అంటూ రాసుకొచ్చారు. దీంతో ప్రస్తతం ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది. ఎప్పుడూ నెగిటివ్‌ కామెంట్స్‌ చేసే వర్మ ఇలా ఓ సినిమాపై ఇంత పాజిటివ్‌గా రెస్పాండ్‌ కావడంతో ట్రిపులార్‌ అభిమానులు కూడా సంతోషిస్తున్నారు.

Also Read: Artillery Centre Jobs: హైదరాబాద్‌ ఆర్టిలెరీ సెంటర్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. 80 వేలకుపైగా జీతం..

Pink & Yellow Tomatoes: త్వరలో మార్కెట్ లోకి పింక్, పసుపు టొమాటోలు.. మరింత టేస్టీగా మారనున్న కూరలు

Viral Video: కచ్చ బాదం డ్యాన్స్‌ ఇలాగా మీరెప్పుడు చూసి ఉండరు !!