Ram Charan: కూల్ కూల్ లుక్‌లో చరణ్.. సిద్దకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన ఆచార్య యూనిట్
Ram Charan: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నట వారసుడిగా టాలీవుడ్ (Tollywood) లో ఎంట్రీ ఇచ్చినా తనదైన శైలిలో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ విలక్షణ నటనతో..
Ram Charan: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నట వారసుడిగా టాలీవుడ్ (Tollywood) లో ఎంట్రీ ఇచ్చినా తనదైన శైలిలో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ విలక్షణ నటనతో కెరీర్ లో జెట్ స్పీడ్ లో దూసుకుని పోతున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈరోజు రామ్ చరణ్ తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. చెర్రీ నటించిన తాజా సినిమా RRR ప్రపంచ వ్యాప్తంగా రిలీజై భారీ స్పందన లభిస్తోంది. ఈ సినిమా సక్సెస్ చరణ్ తన పుట్టిన రోజు వేడుకలకు మరింత జోష్ నిచ్చింది. చెర్రీ పుట్టిన రోజు కానుకగా ఆచార్య చిత్ర యూనిట్ట్మె స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తుండగా.. రామ్ చరణ్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే .
చరణ్ పాత్ర దాదాపు 40 నిమిషాలు ఉంటుందని విశ్వసనీయ వర్గాల టాక్. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఆచార్య టీమ్ ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్ లో రామ్ చరణ్ నీలిరంగు కుర్తా ధరించి ఫ్లూట్ పట్టుకున్నాడు. చిన్న కట్టె పైన ఏదో ధీర్ఘంగా రాస్తున్నట్లు పోస్టర్‌లో ఉంది. పోస్టర్ లుక్ లో సిద్ధ చాలా కూల్ కూల్ గా కనిపిస్తూ.. ఆకట్టుకుంటున్నాడు. ఈ సినిమాలో నక్సలైట్ పాత్రలో నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డితో కలిసి రామ్ చరణ్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు.
ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవి, కాజల్ అగర్వాల్ కథానాయికలుగా నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూర్చారు. ఆచార్య ఏప్రిల్ 29న విడుదల కానుంది. పోస్టర్‌ను విడుదల చేసిన మేకర్స్ ‘ఇప్పటికే ఇది బ్లాక్ బస్టర్ ఏడాది. వచ్చే నెలలో మరింత పెద్ద బ్లాక్ బస్టర్ చేసే వరకు ఆగలేపోతున్నాం’ అంటూ ట్విట్టర్లో తెలిపింది.
Team #Acharya wishes our Mega PowerStar @AlwaysRamCharan a very Happy Birthday ❤️
It is already a blockbuster year, can’t wait to make it bigger next month?#AcharyaOnApr29
Megastar @KChiruTweets #Sivakoratala @MsKajalAggarwal @hegdepooja #ManiSharma @MatineeEnt @adityamusic pic.twitter.com/8Xpa2Ilovv
— Konidela Pro Company (@KonidelaPro) March 27, 2022
Also Read: Bharat Bandh: కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను నిరసిస్తూ.. రేపు, ఎల్లుండి భారత్ బంద్.. కానీ అక్కడ మాత్రం