AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharat Bandh: కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను నిరసిస్తూ.. రేపు, ఎల్లుండి భారత్ బంద్.. కానీ అక్కడ మాత్రం

Bharat Bandh: కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు రేపు (మార్చి 28), ఎల్లుండి (మార్చి 29) భారత్ బంద్ (Strike) కు పిలుపునిచ్చాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల..

Bharat Bandh: కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను నిరసిస్తూ.. రేపు, ఎల్లుండి భారత్ బంద్.. కానీ అక్కడ మాత్రం
Bharath Bandh
Surya Kala
|

Updated on: Mar 27, 2022 | 1:59 PM

Share

Bharat Bandh: కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు రేపు (మార్చి 28), ఎల్లుండి (మార్చి 29) భారత్ బంద్ (Strike) కు పిలుపునిచ్చాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయస్ అసోసియేషన్ కూడా బ్యాంకింగ్(Banking) సెక్టార్ ఈ సమ్మెలో పాల్గొంటుందని తెలిపింది. బంద్ నేపథ్యంలో కస్టమర్లు ముందుగానే సిద్ధం కావాలని పిలుపునిచ్చాయి. లాభాల్లో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కుట్రపూరితంగానే కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోందని కార్మిక సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు, రవాణా, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, కోల్, స్టీల్, ఆయిల్, టెలికాం, పోస్టల్, ఇన్‌కమ్ ట్యాక్స్, కాపర్, వంటి రంగాలకు చెందిన కార్మిక సంఘాలు ఈ మేరకు సమ్మె నోటీసులను జారీ చేశాయి. రైల్వే, రక్షణ రంగాలకు చెందిన సంఘాలు కూడా ఈ సమ్మెకు మద్దతు (support) ఇచ్చాయి. దేశవ్యాప్తంగా సమ్మె జరిగే వందల చోట్ల భారీ జనసమీకరణకు సహకరిస్తామని వెల్లడించాయి.

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ కూడా ఈ సమ్మె వల్ల తన బ్యాంకింగ్ సర్వీసులు ప్రభావితమవుతుందని తెలిపింది. ఈ రెండు రోజుల సమ్మె నేపథ్యంలో బ్యాంక్ శాఖల సాధారణ కార్యకలాపాలలో ఎలాంటి అంతరాయం కలుగకుండా ఉండేందుకు ప్రయత్నిస్తామని వివరించింది. మరోవైపు ఈ రెండు రోజులు ప్రభుత్వ ఉద్యోగులందరూ కచ్చితంగా ఆఫీసులకు రావాలని, తప్పనిసరిగా డ్యూటీకి రిపోర్టు చేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Also Read: Viral Video: బాలిక కాన్ఫిడెన్స్‌కి అంధత్వం దాసోహం.. కళ్లు కనిపించకున్నా బాస్కెట్‌ బాల్‌ గేమ్‌లో అదరగొట్టిన బాలిక

Australia: ఇది మాములు బుక్ కాదు.. మగవాళ్లని అలా క్యూలో నిలబెట్టవచ్చు..