Viral Video: బాలిక కాన్ఫిడెన్స్‌కి అంధత్వం దాసోహం.. కళ్లు కనిపించకున్నా బాస్కెట్‌ బాల్‌ గేమ్‌లో అదరగొట్టిన బాలిక

Inspiring Story: హైస్కూల్ బాస్కెట్‌బాల్ గేమ్‌ (Basketball game) జరుగున్న సమయంలో ఒక అంధ బాలిక ( Blind girl)  కోసం పాఠశాల మొత్తం ఉత్సాహంగా ఉల్లాసంగా కనిపించిన హృదయాన్ని..

Viral Video: బాలిక కాన్ఫిడెన్స్‌కి అంధత్వం దాసోహం.. కళ్లు కనిపించకున్నా బాస్కెట్‌ బాల్‌ గేమ్‌లో అదరగొట్టిన బాలిక
Blind Girl Basket Ball
Follow us
Surya Kala

|

Updated on: Mar 27, 2022 | 1:48 PM

Viral Video: హైస్కూల్ బాస్కెట్‌బాల్ గేమ్‌ (Basketball game) జరుగున్న సమయంలో ఒక అంధ బాలిక ( Blind girl)  కోసం పాఠశాల మొత్తం ఉత్సాహంగా ఉల్లాసంగా కనిపించిన హృదయాన్ని కదిలించే వీడియో సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది. గుడ్ న్యూస్ మూవ్‌మెంట్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ  వీడియో షేర్ చేయబడింది. ఇప్పటి వరకూ ఇప్పటివరకు 13.8 మిలియన్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఈ దృశ్యం అమెరికాలోని మిచిగాన్‌లోని జీలాండ్ ఈస్ట్ హైస్కూల్‌లో కెమెరాకు చిక్కింది. అవును ఆ బాలిక కాన్ఫిడెన్స్‌కి అంధత్వం సిగ్గుపడింది.. తన ఆటతీరుకి విధిసైతం తలవంచింది. కళ్లు కనిపించకపోయినా తనలోని ప్రతిభతో సత్తా చాటింది ఓ బాలిక. సాధారణంగా కళ్లు కనిపించే వారికే బాస్కెట్‌బాల్ ఆట కష్టమైంది. ఎంతో అనుభవజ్ఞులు.. ప్రాక్టీస్‌ ఉన్నవారు కూడా ఒక్కోసారి రిమ్‌లో బాల్‌ వేయలేరు. ఎన్నోసార్లు విఫ‌ల‌మ‌వుతుంటారు. కానీ ఓ అంధ బాలిక ఒకే అటెంప్ట్‌లో అద్భుతమైన స్కోర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వీడియో ఇంట‌ర్నెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

ఓ మైదానంలో ఇంట‌ర్ స్కూల్ గేమ్స్ జరుగుతున్నాయి. బాస్కెట్‌బాల్ మ్యాచ్ చూసేందుకు స్టేడియంలో ప్రేక్షకులు కిక్కిరిసిపోయారు. జూల్స్ హూగ్‌లాండ్ అనే అంధ బాలిక బాల్‌ప‌ట్టుకుని రెడీగా ఉంది. బాస్కెట్ రిమ్ వెనుకాల ఓ టీచ‌ర్ ఓ రాడ్డుతో శ‌బ్దం చేస్తూ ఉంది. ఆ శ‌బ్దం ఆధారంగా జూల్స్ ఒకే అటెంప్ట్‌లో స్కోర్ చేసింది. దాంతో అప్పటిదాకా సైలెంట్‌గా ఎంతో ఉత్కంఠగా చూస్తున్న ప్రేక్షకులంతా ఒక్కసారిగా నిల్చొని చ‌ప్పుట్లతో హర్షద్వానాలు చేశారు. ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు బాలిక టాలెంట్‌కు ముగ్దులవుతున్నారు. తమ కామెంట్లతో బాలికను బ్లెస్‌ చేస్తున్నారు.

Also Read: Black box: చైనా విమాన ప్రమాద ఘటనలో మరో బ్లాక్ బాక్స్ లభ్యం.. కీలక వివరాలు తెలిసే అవకాశం

Australia: ఇది మాములు బుక్ కాదు.. మగవాళ్లని అలా క్యూలో నిలబెట్టవచ్చు..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే