Viral: ఆన్​లైన్​ గేమ్స్​ ఆడి.. ఆడి మతి పోయింది.. రోడ్డుపైకి వెళ్లి వింత అరుపులు.. చివరకు ఇలా..

ప్రజంట్ చేతిలో మొబైల్, అందులో ఇంటర్నెట్ లేని వ్యక్తులు కనిపించడం చాలా అరుదు. అయితే విపరీతంగా అందుబాటులోకి వచ్చిన  టెక్నాలజీ వల్ల మంచి ఎంత ఉందో.. చెడు కూడా అంతే ఉంది.

Viral: ఆన్​లైన్​ గేమ్స్​ ఆడి.. ఆడి మతి పోయింది.. రోడ్డుపైకి వెళ్లి వింత అరుపులు.. చివరకు ఇలా..
Online Games Effect
Follow us

|

Updated on: Mar 27, 2022 | 1:26 PM

Rajasthan: ప్రజంట్ చేతిలో మొబైల్, అందులో ఇంటర్నెట్ లేని వ్యక్తులు కనిపించడం చాలా అరుదు. అయితే విపరీతంగా అందుబాటులోకి వచ్చిన  టెక్నాలజీ వల్ల మంచి ఎంత ఉందో.. చెడు కూడా అంతే ఉంది. ముఖ్యంగా టీనేజ్ యువత సోషల్ మీడియా, ఆన్‌లైన్ గేమ్స్ మోజులో పడి.. విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. రోజంతా అదే ధ్యాసలో ఉంటున్నారు. కొన్నిసార్లు బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయి ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. మరికొందరు రాత్రనగా, పగలనగా ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతూ.. మానసిక సమస్యల బారిన పడుతున్నారు.  ఇటీవల ఆన్​లైన్​ గేమ్స్​కు బానిసై వింతగా ప్రవర్తిస్తున్న సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. తాజాగా అలాంటి మరో కేసు రాజస్థాన్​లోని చిత్తోడ్​గఢ్(chittorgarh)​లో జరిగింది. బాన్​సెన్​ గ్రామానికి చెందిన ఇర్ఫాన్​ అన్సారీ అనే యువకుడు ఆన్​లైన్​ గేమ్స్​(Online Games) విపరీతంగా ఆడేవాడు. ఒకరకంగా వాటికి మానిసయ్యాడు.  ఈ క్రమంలోనే అతడి మానసిక ఆరోగ్యం దెబ్బతింది. మతి తప్పిపోయినట్లు ప్రవర్తిస్తున్నాడు. రోడ్లపై వెళ్తూ హ్యాకర్​, హ్యాకర్​.. పాస్​వర్డ్​ మార్చుకోండి అంటూ వింతగా అరుస్తున్నాడు. అన్సారీ గతంలో బిహార్​లోని చప్​రా ఏరియాలో నివసించేవాడు. కొద్ది రోజుల క్రితమే రాజస్థాన్​లోని బాన్​సెన్​కు వచ్చాడు. గంటల కొద్దీ మొబైల్​ ఫోన్​ పట్టుకునే ఉంటాడని, ఫైరింగ్​ గేమ్స్​ ఎక్కువగా ఆడుతున్నట్లు గుర్తించామని ఫ్యామిలీ మెంబర్స్ తెలిపారు.

గత గురువారం రాత్రి సమయంలో గేమ్​ ఆడుతుండగా ఆకస్మత్తుగా ఫోన్​ స్విచ్​ ఆఫ్​ అయింది. ఆ తర్వాత మతిస్థితిమితం కోల్పోయిన వాడిలా ప్రవర్తించటం షురూ చేశాడు. శుక్రవారం పొద్దున ఉదయ్​పుర్​ రోడ్డుపైకి చేరి వాహనాలను ఆపుతూ పాస్​వర్డ్స్​ మార్చుకోవాలని వింతగా కేకలు వేశాడు. గమనించిన స్థానికులు పట్టుకుని మంచానికి కట్టేశారు. కుటుంబ సభ్యులకు అప్పగించగా.. జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మెంటల్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అతిగా ఆన్‌లైన్ గేమ్స్ ఆడేవారికి ఇదో హెచ్చరిక అంటున్నారు మానసిక వైద్య నిపుణులు.

Also Read: ‘ప‌ర‌మ్ సుంద‌రి’ పాట‌కు డాన్స్‌‌ చేసి పిచ్చెక్కించిన ఎయిర్‌హోస్టెస్.. సూపర్బ్ అంతే

 Hyderabad: ఏప్రిల్ నుంచి హైదరాబాద్‌లో కొత్త ట్రాఫిక్ రూల్స్.. అలా చేస్తే డైరెక్ట్ జైలుకే

Latest Articles