Karnataka: జాతరలో 73 ఏళ్ల వయసులోనూ ఉత్సాహంగా జానపద నృత్యాన్ని చేసిన మాజీ సీఎం సిద్ధరామయ్య.. వీడియో వైరల్

Karnataka: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ( Former CM Siddaramaiah) జాతర సందర్భంగా కర్ణాటకకు చెందిన సాంప్రదాయ జానపద నృత్య (Traditional folk dance) రూపమైన..

Karnataka: జాతరలో 73 ఏళ్ల వయసులోనూ ఉత్సాహంగా జానపద నృత్యాన్ని చేసిన మాజీ సీఎం సిద్ధరామయ్య.. వీడియో వైరల్
Siddaramaiah Performs Folk
Follow us

|

Updated on: Mar 27, 2022 | 12:03 PM

Karnataka: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ( Former CM Siddaramaiah) జాతర సందర్భంగా కర్ణాటకకు చెందిన సాంప్రదాయ జానపద నృత్య (Traditional folk dance) రూపమైన వీర కుణితాన్ని ప్రదర్శించారు. ఇప్పుడు, రాజకీయ నాయకుడు నృత్యం చేస్తున్న వీడియో ఆన్‌లైన్‌లో సంచలనం సృష్టించింది. ఈ వీడియోలో..  కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్య..  సిద్ధరామేశ్వర స్వామి జాతర సందర్భంగా తన స్వగ్రామమైన సిద్ధరామనహుండిలో కొంతమంది పురుషులతో కలిసి నృత్యం చేయడాన్ని చూడవచ్చు. ఈ  ఉత్సవంలో సిద్ధరామయ్య , ఇతరులు ఆడి పాడారు. ఈ సమయంలో భారీ సంఖ్యలో ప్రజలు చుట్టూ గుమిగూడారు. సాంప్రదాయ డ్రమ్స్  వాయిస్తూ.. డప్పుల వాయిద్యానికి అనుగుణంగా  నృత్యం చేస్తూ ఉత్సాహంగా ఉన్నారు.

మైసూరులోని వరుణ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర ఆన్‌లైన్‌లో షేర్ చేయడంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.

సీనియర్ రాజకీయ నాయకుడు మాజీ సీఎం సిద్దరామయ్య సుమారు 40 నిమిషాల పాటు నృత్యం చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఈ జాతరలో పాల్గొనేందుకు సంతోషిస్తున్నానని.. ఈ జాతరను తాను ఎప్పుడూ మిస్ అవ్వనని.. ఉప ముఖ్యమంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా  జాతరకు వచ్చినట్లు చెప్పారు. ఇప్పుడు కూడా ఈ జాతరకు వచ్చినట్లు సిద్ధరామయ్య చెప్పారు.

తనకు మధుమేహం రాకపోతే మరింత ఉత్సాహంగా డ్యాన్స్ చేసి ఉండేవాడినని కాంగ్రెస్ నేత అన్నారు. “నేను పాటలను మరచిపోయి ఉండవచ్చు..  కానీ నేను చాలా ఏళ్ల క్రితం నుంచి ఈ బీట్‌లకు డ్యాన్స్ చేయడం ప్రారంభించాను” అని 73 ఏళ్ల సిద్ధరామయ్య చెప్పారు. ఈ మాజీ సీఎం చిన్నతనంలోనే డ్యాన్స్ నేర్చుకున్నట్లు తెలుస్తోంది.

ఈ జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అయితే కరోనా మహమ్మారి, ఆలయ  పునరుద్ధరణ పనుల కారణంగా గత ఆరు సంవత్సరాలుగా జాతర నిర్వహించలేదు. ఈ సంవత్సరం జాతరను నిర్వహించడంతో.. భారీగా ప్రజలు ఆలయానికి తరలివచ్చారు. నూతన ఉత్సాహంతో జాతరలో పాల్గొన్నారని స్థానిక మీడియా పేర్కొంది.

Also Read: విమానం ఎక్కాలంటే మగ తోడు తప్పనిసరి.. మహిళల ప్రయాణంపై అక్కడి ప్రభుత్వం ఆంక్షలు

Bandla Ganesh: ఉత్తరప్రదేశ్ సీఎంతో బండ్ల గణేష్ మంతనాలు.. నువ్వు సూపరన్న అంటున్న నెటిజన్ల

Happy Birthday Ram Charan: చెర్రీకి డిఫరెంట్‌గా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన మెగా ఫ్యాన్స్..

Latest Articles