AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ambulance Service: రెండు సెకన్లలో రెస్పాన్స్.. 15 నిమిషాల్లో అంబులెన్స్.. ఈ స్టార్టప్‌కు పెట్టుబడుల వెల్లువ..

Ambulance Service: ఇప్పటి దాకా మనం అరగంటలో ఫుడ్ డెలివరీ, 10 నిమిషాల్లో గ్రాసరీస్ డెలివరీ ఇస్తున్న టెక్‌స్టార్టప్ లు అందుబాటులోకి రావటం చూస్తున్నాం. అదే అంబులెన్స్ సేవలు కేవలం 15 నిమిషాల్లో అందిస్తోంది ఆ హెల్త్ స్టార్టప్ సంస్థ..

Ambulance Service: రెండు సెకన్లలో రెస్పాన్స్.. 15 నిమిషాల్లో అంబులెన్స్.. ఈ స్టార్టప్‌కు పెట్టుబడుల వెల్లువ..
Ambulance Service
Ayyappa Mamidi
|

Updated on: Mar 27, 2022 | 11:29 AM

Share

Ambulance Service: ఇప్పటి దాకా మనం అరగంటలో ఫుడ్ డెలివరీ, 10 నిమిషాల్లో గ్రాసరీస్ డెలివరీ ఇస్తున్న టెక్‌స్టార్టప్ లు అందుబాటులోకి రావటం చూస్తున్నాం. అనేక మంది తమ వృత్తి, వ్యాపారాల కారణంగా వాటి సేవలను సైతం భారీగానే వినియోగించుకుంటున్నారు. కానీ తాజాగా ఇప్పుడు 15 నిమిషాల్లో అంబులెన్స్ సర్వీస్ అందించాలనుకుంటున్న స్టార్టప్ పై ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఎమర్జెన్సీ మెడికల్ రెస్పాన్స్(Emergency Medical Response) స్టార్టప్ స్టాన్‌ప్లస్ అంబులెన్స్ సేవలను విప్లవాత్మకంగా మార్చే క్రమంలో మరో కీలక అధ్యాయానికి నాంది పలికింది. ఇప్పటి వరకు ఎమర్జెన్సీ అంబులెన్స్ సర్వీస్ సమయంలో చాలా సార్లు గంటల్లో ఉంటుంది. కానీ ఈ కొత్త తరం కంపెనీ దానిని కేవలం నిమిషాల్లోకి తగ్గించింది. స్టాన్‌ప్లస్ (Stan Plus) సంస్థ ఆసుపత్రుల అత్యవసర ప్రతిస్పందన కోసం అంబులెన్స సేవలను అందిస్తోంది. ఇందులో భాగంగా పూర్తి స్థాయి ఎమర్జెన్నీ మెడికల్ సేవలను కూడా అందిస్తోంది. ఈ హెల్ట్‌టెక్ స్టార్టప్ ను ప్రభదీప్ సింగ్, ఆంటోయిన్ పోయిర్సన్, జోస్ లియోన్ సంయుక్తంగా 2016లో ప్రారంభించారు. ప్రస్తుతం వారు 15 నిమిషాల్లోనే బాధితులకు అంబులెన్స్ సేవలను అందిస్తున్నారు. రానున్న కాలంలో ఈ సమయాన్ని కేవలం 8 నిమిషాలకు తగ్గించాలని వారు ప్రయత్నిస్తున్నారు.

రెండు సెకన్లలో స్పందన..

ఇందుకోసం మెడికల్ స్టార్టప్ టెలిఫోనిక్ సిస్టమ్లను, డ్రైవర్లను, పారామెడిక్ సిబ్బందిని, హాస్పిటళ్ల అంబులెన్సులను ఏకతాటిమీదుకు తెచ్చి ఒక నెట్ వర్క్ ను నిర్మిస్తోంది. కంపెనీ తన సొంత అడ్వాన్స్ డ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ కలిగిన అంబులెన్సులను కలిగి ఉంది. నాన్ కోవిడ్ సమయంలో సరాసరిన కేవలం రెండు సెకన్ల కాలంలోనే 97 శాతం కాల్స్ కు కంపెనీ స్పందిస్తుండగా.. హాస్పిటళ్లు 65 శాతం స్పందిస్తున్నాయి. కంపెనీ తనకు ఉన్న 3000 అంబులెన్సుల్లో ఒక దానికి బాధితుల నుంచి కాల్ రాగానే దగ్గరలోని దానికి కనెక్ట్ చేస్తుంది. ఇందుకోసం హాస్పిటళ్లకు సైతం సబ్ స్కిప్షన్ పద్ధతిలో సాంకేతికతను అందిస్తోంది. స్టార్టప్ జనవరిలో హెల్త్‌కేర్ వెంచర్ క్యాపిటల్ ఫర్మ్ హెల్త్‌క్వాడ్, హెల్త్‌ఎక్స్ నుంచి సిరీస్-A రౌండ్‌ ఫండింగ్ లో భాగంగా 20 మిలియన్ డాలర్లను సమీకరించింది. ఈ స్టార్టప్ అంబులెన్స్‌లను లీజుకు ఇవ్వడం కోసం గ్రిప్ ఇన్వెస్ట్ నుంచి మరో 2 మిలియన్ డాలర్లను సేకరించింది.

అభివృద్ధి చెందిన దేశాల్లో ఇలా..

ప్రపంచంలో ఎమర్జెన్సీ సేవల సమయాన్ని పరిశీలిస్తే భారత్ లో ఆ సమయం 45 నిమిషాల కంటే ఎక్కువగానే ఉంది. అదే అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ సమయం కేవలం 7 నిమిషాలుగా ఉంది. బాధితులను ఆసుపత్రికి చేర్చటంలో జరిగే ఒక్కో నిమిషం ఆలస్యం వల్ల అతడు బ్రతికే అవకాశాలు 7 నుంచి 10 శాతం మేర తరిగిపోతుంటాయి. అందువల్ల సరైన సమయంలో అంబులెన్స్ సేవలను అవసరంలో ఉన్న వారి వద్ధకు చేర్చేందుకు ఈ సంస్థ తన వంతు ప్రయత్నం చేస్తున్నట్లు చెబుతోంది.

ఇవీ చదవండి..

Yatra IPO: మార్కెట్లోకి మరో ఐపీవో.. రూ.750 కోట్ల మెగా ఇష్యూకు సిద్ధమౌతున్న ట్రావెల్ కంపెనీ..

Multibagger stock: ఇన్వెస్టర్ల సంపదను 87 రెట్లు పెంచిన అదానీ షేర్.. మీ దగ్గర ఉందా..?