Multibagger stock: ఇన్వెస్టర్ల సంపదను 87 రెట్లు పెంచిన అదానీ షేర్.. మీ దగ్గర ఉందా..?
Multibagger stock: స్టాక్ మార్కెట్లో లాభాలు పొందాలంటే ముందుగా కావలసింది ఓర్పు. రాబడి కోసం దీర్ఘకాలం వేచి ఉండే వారికి మంచి రాబడిని చాలా కంపెనీల షేర్లు ఇస్తుంటాయి.
Multibagger stock: స్టాక్ మార్కెట్లో లాభాలు పొందాలంటే ముందుగా కావలసింది ఓర్పు. రాబడి కోసం దీర్ఘకాలం వేచి ఉండే వారికి మంచి రాబడిని చాలా కంపెనీల షేర్లు ఇస్తుంటాయి. అదానీ గ్రూప్(Adani Group) కు చెందిన అదానీ ట్రాన్స్ మిషన్(Adani Transmission) కూడా ఒకటి. గడచిన ఏడేళ్ల కాలంలో షేర్ ధర రూ.27.60 నుంచి రూ.2420 కి చేరుకుంది. ఇలా చేరు తన పెట్టుబడి దారులకు లాంగ్ టర్మ్ లో మంచి రాబడులను అందించింది. ఒక్క నెల వెవదిలో షేర్ ధర రూ.2032 నుంచి రూ.2420 కు చేరుకుంది. గడచిన ఆరు నెలల కాలంలో షేర్ ధర రూ.1578 నుంచి ప్రస్తుతం ఉన్న రూ.2420కు చేరుకుంది. ఈ మల్టీ బ్యాగర్ షేర్ 5 సంవత్సరాల కాలంలో రూ.81.35 నుంచి రూ.2420 పెరిగింది.. అంటే 3760 శాతం పెరుగుదలను షేర్ నమోదు చేసింది.
మార్చి 31, 2015లో రూ.27.60 గా ఉన్న షేర్ విలువ మార్చి 24, 2022 నాటికి రూ. 2420 కి చేరుకుంది. అంటే 7 సంవత్సరాల క్రితం రూ. లక్ష పెట్టుబడిగా పెడితే ప్రస్తుతం దాని విలువ రూ.87.70 లక్షలకు చేరుకుంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.56 లక్షల కోట్లుగా ఉంది. నెల కిందట ఈ షేర్ లో రూ. లక్ష పెట్టుబడి పెట్టగా దాని విలువ ఇప్పుడు రూ.1.20 లక్షలుగా ఉంది. సంవత్సరం కిందట రూ.లక్ష పెట్టుబడి పెట్టగా దాని విలువ రూ. 2.90 లక్షలుగా ఉంది. అదే 5 ఏళ్ల పాటు లక్ష రూపాయలను ఇందులో ఇన్వెస్ట్ చేసిన వారికి ప్రస్తుతం రూ. 37.70 లక్షల రాబడిని ఈ స్టాక్ అందించింది.
గమనిక: ఇక్కడ అందిస్తున్న ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఆర్ధిక నిపుణులు వెల్లడించిన అభిప్రాయాలు.. ఆయా కంపెనీల పనితీరుపై నిపుణులు అందించిన సమాచారం ఆధారంగా ఈ ఆర్టికల్ అందిస్తున్నాం. స్టాక్స్, ఫండ్స్, ఇన్సూరెన్స్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టేముందు ఆర్ధిక నిపుణుల సలహా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.
ఇవీ చదవండి..
House Purchase: చిన్న ఇల్లు కొంటే పెద్ద లాభం.. ఎలాగో తెలుసా..
Gold Purchase: అమ్మాయి పెళ్లా? అయితే తక్కువ ధరలో బంగారాన్ని ఇలా కొనండి..