AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy Birthday Ram Charan: చెర్రీకి డిఫరెంట్‌గా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన మెగా ఫ్యాన్స్..

Happy Birthday Ram Charan: రామ్ చరణ్ పుట్టిన రోజు నేడు.. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)  నట వారసుడిగా రామ్ చరణ్ చిరుత(Chiruta) సినిమాతో వెండి తెరపై అడుగు పెట్టాడు..

Happy Birthday Ram Charan: చెర్రీకి డిఫరెంట్‌గా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన మెగా ఫ్యాన్స్..
East Godavari Ram Charan Hb
Surya Kala
|

Updated on: Mar 27, 2022 | 11:33 AM

Share

Happy Birthday Ram Charan: రామ్ చరణ్ పుట్టిన రోజు నేడు.. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)  వారసుడిగా రామ్ చరణ్ చిరుత(Chiruta) సినిమాతో వెండి తెరపై అడుగు పెట్టాడు. తండ్రి వారసత్వంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన చెర్రీ.. తన సెకండ్ మూవీ మగధీర సినిమాతో సరికొత్త రికార్డ్స్ ను సృష్టించాడు. ఓ వైపు మాస్ సినిమాల్లో నటిస్తూనే.. ధ్రువ, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ వంటి డిఫరెంట్ నేపధ్య సినిమాల్లో నటిస్తూ.. తన నటనతో విమర్శకుల ప్రశంసలను అందుకుంటున్నాడు. తాజాగా రామ్ రణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా రాజమ హేంద్రవరంలో అభిమానులు సందడి చేస్తున్నారు.

చెర్రీ ఫ్యాన్స్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ ను ఘనంగా నిర్వహిస్తున్నారు. చరణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలను చెబుతూ.. అభిమానులు నేలపై రంగులతో భారీ చిత్రాన్ని రూపొందించారు. వి. ఎల్. పురంలోని కారు వాష్ షెడ్డు వెనుక ఖాళీ స్థలంలో చంటి, చరణ్ ఆర్ట్స్, చిన్నికోట అనే యువకులు తోటి అభిమానులతో కలిసి ఈ చిత్రాన్ని రూపొందించారు. 20 అడుగుల ఎత్తు, 16 అడు గుల వెడల్పు ఉండే ఈ చిత్రాన్ని నాలుగు రంగులతో రూపొందించినట్లు వారు తెలిపారు. రాం చరణ్ చిత్రం వేసిన ఆర్ట్ వద్దే కేకు కోసి చరణ్ పుట్టినరోజు వేడుక నిర్వహించనున్నామని తెలిపారు. మ అభిమాన హీరోకి పుట్టిన రోజుకి RRR సినిమా విజయం సందర్బంగా ఈ చిత్రం రాంచరణ్  కు బహుమతి అని.. అందుకనే తాము ఈ ఫోటోని రూపొందించామని అభిమానులు చెప్పారు.

Also Read: Happy Birthday Ram Charan: నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న చెర్రీ.. మంచి నటుడే కాదు మంచి జంతు ప్రేమికుడు