AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR-NTR: తారక్ నటనకు ప్రేక్షకులు భావోద్వేగం.. చరణ్.. ఎన్టీఆర్ కొట్టుకోవడం చూసి కన్నీళ్లు పెట్టుకున్న మహిళ..

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ (RRR) ప్రభంజనం సృష్టిస్తోంది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది.

RRR-NTR: తారక్ నటనకు ప్రేక్షకులు భావోద్వేగం.. చరణ్.. ఎన్టీఆర్ కొట్టుకోవడం చూసి కన్నీళ్లు పెట్టుకున్న మహిళ..
Ntr
Rajitha Chanti
|

Updated on: Mar 27, 2022 | 2:45 PM

Share

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ (RRR) ప్రభంజనం సృష్టిస్తోంది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. వెండితెరపై చరణ్.. తారక్ స్నేహాన్ని చూసి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఆర్ఆర్ఆర్ చూసేందుకు థియేటర్లకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.. మార్చి 25న విడుదలైన ఈ మూవీ టాలీవుడ్ రికార్డ్స్ తిరగరాస్తూ దూసుకుపోతుంది. ఇందులో చరణ్.. అల్లురీ సీతారామరాజుగా.. తారక్.. గోండు వీరుడు కొమురం భీంగా నటించి మెప్పించారు. తారక్.. చరణ్ నటనకు సినీ విశ్లేషకులు.. సెలబ్రెటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. విడుదలకు ముందే ప్రీమియర్ రికార్డ్స్ బద్దలు కొట్టిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు చేస్తూ రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. అయితే ఇందులో చరణ్.. తారక్ స్క్రీన్ ప్రెజెన్స్‏కు అభిమానులు ఫిదా అయిపోయారు. తారక్.. చరణ్ స్నేహాన్ని వెండితెరపై చూసి మురిసిపోతున్నారు. అయితే ఈ మూవీలో ఓ సీన్ చూసి అభిమానుల కళ్లు చెమ్మగిల్లుతున్నాయి.

అదే తారక్.. చరణ్ ఫైట్ సీన్. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకు అభిమానులు.. సెలబ్రెటీలు.. ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. స్నేహానికి ప్రాణమిచ్చే కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ జీవించేశారు. తెరపై కొన్ని సన్నివేశాల్లో తారక్ అమాయకత్వం.. చరణ్‏తో కలిసి చేసే పోరాట సన్నివేశాల్లో ఎన్టీఆర్ నటన అద్భుతమనే చెప్పుకోవాలి. ఇక కొమురం భీముడో పాటలో ఎన్టీఆర్ నటన ప్రేక్షకులతో కన్నీరు పెట్టిస్తోంది. ఆ పాటలో చరణ్ ఎన్టీఆర్‏ను కొడుతుంటే.. థియేటర్లలో ప్రేక్షకుల కళ్లు చెమర్చుతున్నాయి. చరణ్ తారక్‏ను కొడుతున్న సీన్ చూసి థియేటర్‏లో ఓ మహిళ భావోద్వేగానికి గురైంది.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాను రూ. 450 కోట్ల భారీ బడ్జెట్‏తో డీవీవీ దానయ్య తెరకెక్కించారు.

Also Read: Ram Charan: కూల్ కూల్ లుక్‌లో చరణ్.. సిద్దకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన ఆచార్య యూనిట్

Priyanka Mohan: లేలేత గులాబీ సోయగాల సుందరి.. కుర్రకారు మనసులను దోచేస్తోన్న సొగసరి..

Prabhas : క్రేజీ న్యూస్.. ఆదిపురుష్‌లో ప్రభాస్ ఆ అవతారంలో కనిపించనున్నాడట..

RRR Movie: ట్రిపులార్‌ సక్సెస్‌పై తనదైన స్టైల్‌లో స్పందించిన రామ్‌గోపాల్‌ వర్మ.. ఏమన్నరాంటే..

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..