Ayurvedic Benefits of Ghee: నెయ్యితో వెయ్యి లాభాలు.. రోగాల భరతం పట్టే ఔషధాల గని! రోజూ కాస్తింత తింటే చాలు
తెలుగింటి విందు భోజనాల్లో నెయ్యి తప్పనిసరిగా ఉంటుంది. నెయ్యి వంటకు రుచిని జోడించడమే కాకుండా, అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అందుకే ఆయుర్వేదంలో నెయ్యిని విస్తృతంగా ఉపయోగిస్తుంటారు. కొన్నిసార్లు జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందడానికి, మరికొన్నిసార్లు అజీర్ణం నుంచి ఉపశమనం పొందేందుకు ఇలా ఎన్నో రకాలుగా నెయ్యి ఉపయోగపడుతుంది. నెయ్యిలో విటమిన్ ఎ, డి, ఎ, కె వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి..

తెలుగింటి విందు భోజనాల్లో నెయ్యి తప్పనిసరిగా ఉంటుంది. నెయ్యి వంటకు రుచిని జోడించడమే కాకుండా, అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అందుకే ఆయుర్వేదంలో నెయ్యిని విస్తృతంగా ఉపయోగిస్తుంటారు. కొన్నిసార్లు జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందడానికి, మరికొన్నిసార్లు అజీర్ణం నుంచి ఉపశమనం పొందేందుకు ఇలా ఎన్నో రకాలుగా నెయ్యి ఉపయోగపడుతుంది. నెయ్యిలో విటమిన్ ఎ, డి, ఎ, కె వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. నెయ్యిలో ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. ఈ పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఎముకలను బలంగా ఉంచుతాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. శారీరక మంటను తగ్గించే శక్తి నెయ్యికి ఉంటుంది. ఆయుర్వేదంలో నెయ్యి ఏయే సందర్భాలలో ఉపయోగపడుతుందో తెలుసుకుందాం..
జీర్ణ ఆరోగ్యం
నెయ్యి జీర్ణవ్యవస్థను లూబ్రికేట్ చేస్తుంది. ఇది జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోజూ ఒక చెంచా నెయ్యి తీసుకుంటే మలబద్ధకం, అజీర్తిని నివారిస్తుంది.
గాయాలను నయం చేస్తుంది
నెయ్యిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. ఇది గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది. చిన్న గాయాలు, కాలిన గాయాలపై నెయ్యి రాయవచ్చు. ఇది చర్మ గాయాలను త్వరగా నయం చేసి, సౌకర్యాన్ని అందిస్తుంది.
కీళ్ల ఆరోగ్యం
నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఎముకలు, కీళ్లలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. నెయ్యి తినడం వల్ల కీళ్లనొప్పులు తగ్గుతాయి. నెయ్యిని వేడి చేసి కీళ్లపై మసాజ్ చేయవచ్చు. ఇది కీళ్ల దృఢత్వం, అస్థిరతను తొలగిస్తుంది.
చర్మ ఆరోగ్యం
నెయ్యిలో విటమిన్ ఎ, డి, ఇ, కె ఉంటాయి. ఇవి చర్మాన్ని తేమగా ఉంచుతాయి. పొడి, కఠినమైన చర్మ సమస్యలను దూరం చేస్తుంది. ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు నెయ్యితో ముఖాన్ని మసాజ్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల చర్మం ఆకృతిని, టోన్‌ను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా ఇది ముఖ ముడతలను కూడా తొలగిస్తుంది.
ఊపిరితిత్తుల ఆరోగ్యం
ఆయుర్వేదంలో.. నెయ్యిని కొన్ని సుగంధ ద్రవ్యాలు, మూలికా పదార్థాలతో తయారు చేస్తారు. ఇలా చేయడం వల్ల నెయ్యి నాణ్యత మరింత పెరుగుతుంది. ఈ రకమైన నెయ్యి జలుబు నివారణకు సహాయపడుతుంది. అంతేకాకుండా పసుపు లేదా అల్లం కూడా నెయ్యిలో కలుపుకోవచ్చు. ఇది ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు తొలగిపోతాయి.
నల్లటి వలయాలు
నెయ్యి తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. కంటి చుట్టూ ఉండే నల్లటి వలయాలను తొలగించేందుకు కూడా నెయ్యి ఉపయోగపడుతుంది. కళ్ల చుట్టూ కొద్దిగా నెయ్యి రాసి మసాజ్ చేసుకోవాలి. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అలాగే కళ్ల కింద వాపును తొలగిస్తుంది.
మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.








