Coconut Water For Hair: చండ్రు సమస్యతో జుట్టు రాలుతోందా? కొబ్బరి నీళ్లను ఇలా వాడితే బోలెడన్ని ప్రయోజనాలు..
నేటి కాలంలో జుట్టు రాలడం సాధారణ సమస్యగా మారిపోయింది. ప్రతి ఒక్కరూ ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఎన్ని సౌందర్య సాధనాలు ఉపయోగించినా తాత్కాలిక ఉపశమనం దొరుకుందే తప్ప, శాశ్వతంగా సమస్య పరిష్కారం లభించదు. అయితే కురుల సంరక్షణలో కొబ్బరి నీరు ఎంతో కీలక పాత్ర పోషిస్తుందని మీకు తెలుసా? అదెలాగో ఇక్కడ తెలుసుకుందాం.. కొబ్బరి నీళ్లు జుట్టుకు పోషణనిస్తుంది. ఈ నీరు చుండ్రు సమస్యను శాశ్వతంగా దూరం చేస్తుంది. అలాగే జుట్టు రాలడాన్ని నివారిస్తుంది..
Updated on: Feb 25, 2024 | 11:44 AM

నేటి కాలంలో జుట్టు రాలడం సాధారణ సమస్యగా మారిపోయింది. ప్రతి ఒక్కరూ ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఎన్ని సౌందర్య సాధనాలు ఉపయోగించినా తాత్కాలిక ఉపశమనం దొరుకుందే తప్ప, శాశ్వతంగా సమస్య పరిష్కారం లభించదు. అయితే కురుల సంరక్షణలో కొబ్బరి నీరు ఎంతో కీలక పాత్ర పోషిస్తుందని మీకు తెలుసా? అదెలాగో ఇక్కడ తెలుసుకుందాం..

కొబ్బరి నీళ్లు జుట్టుకు పోషణనిస్తుంది. ఈ నీరు చుండ్రు సమస్యను శాశ్వతంగా దూరం చేస్తుంది. అలాగే జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. అంతే కాకుండా కొబ్బరి నీళ్లను వాడితే జుట్టు నిగనిగలాడుతుంది. అలాగే చివర్లు చీలిపోయే సమస్య నుంచి కూడా విముక్తి లభిస్తుంది.

కొబ్బరి నీళ్లలో కార్బోహైడ్రేట్లు, సోడియం, ఫైబర్, పొటాషియం, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం అధికంగా ఉన్నాయి. ఇవి జుట్టుకు పోషణనిస్తాయి. తలకు తేమను పునరుద్ధరిస్తుంది. స్కాల్ప్, హెయిర్ pH స్థాయిని కొబ్బరి నీళ్లు బ్యాలెన్స్ చేస్తాయి. ఈ నీటితో జుట్టును కడిగిన తర్వాత, జుట్టు చిక్కుపడదు. బదులుగా జుట్టు మృదువుగా మారుతుంది.

కొబ్బరి నీళ్లను జుట్టు సంరక్షణకు ఎలా ఉపయోగించాలో ఇక్కడ చూద్దాం.. ముందుగా రోజ్ వాటర్, కొబ్బరి నీళ్ళు తీసుకుని, రెండింటినీ బాగా మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయాలి. కొంత సమయం తరువాత, జుట్టును సాదారణ నీళ్తో బాగా కడగాలి.

అలాగే అలోవెరా జెల్‌ను కూడా కొబ్బరి నీళ్లలో కలుపుకుంటే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. ఇది జుట్టును మెరిసేలా, అందంగా చేస్తుంది. కలబందలోని పోషకాలు జుట్టు మరింత బలాన్ని ఇచ్చి రాలకుండా నివారిస్తుంది.




