AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Back Pain: యువతలో పెరుగుతున్న వెన్నునొప్పి సమస్యలు.. ఈ సింపుల్‌ చిట్కాలు పాటిస్తే చెక్‌ పెట్టొచ్చు

కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల వద్ద పనిచేసే వ్యక్తులు ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వారి వెనుక కండరాలు, వెన్నెముక, మెడపై   తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. ఇది క్రమంగా వెన్నునొప్పికి దారి తీస్తుంది.

Back Pain: యువతలో పెరుగుతున్న వెన్నునొప్పి సమస్యలు.. ఈ సింపుల్‌ చిట్కాలు పాటిస్తే చెక్‌ పెట్టొచ్చు
Back Pain
Basha Shek
|

Updated on: Nov 03, 2022 | 6:25 PM

Share

ఇటీవలి కాలంలో నడుము, వెన్ను నొప్పి బాధితుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ కనిపించే ఈ సమస్య ఇప్పుడు యువతలో కూడా ఎక్కువగా కనిపిస్తోంది. ఒత్తిడితో కూడిన జీవనశైలి , ఎక్కువసేపు కూర్చోవడం, వ్యాయామం లేకపోవడం, తక్కువ బరువు , అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు వెన్నునొప్పి సమస్యకు దారితీయవచ్చు. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ వెన్ను నొప్పి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల వద్ద పనిచేసే వ్యక్తులు ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వారి వెనుక కండరాలు, వెన్నెముక, మెడపై   తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. ఇది క్రమంగా వెన్నునొప్పికి దారి తీస్తుంది. ఇక రాత్రిపూట మొబైల్ ఫోన్లలో కాలక్షేపం చేసేవారు మెడపైకి ఎత్తైన దిండు పెట్టుకుని పొట్టపై పడుకుంటారు. ఇలా చేస్తే కూడా వెన్నెముక దెబ్బతింటుంది.

అటూ ఇటూ తిరుగుతూ..

మానసిక ఒత్తిడిని తగ్గించడానికి అలాగే మన వెన్నెముకపై ఒత్తిడిని తగ్గించడానికి అప్పుడప్పుడు కొద్ది పాటి విరామం తీసుకోవాలి. ఎక్కువ సేపు ఒకే భంగిమలో ఒకే చోట కూర్చోకూడదు. కనీసం రెండు గంటలకొకసారైనా లేచి అటూ ఇటూ తిరగాలి. లేకపోతే వెన్నునొప్పి తీవ్రమవుతుంది. ఎక్కువ గంటలు ఒకే భంగిమలో కూర్చోవడం మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. కాబట్టి వీలయినంత వరకు వెన్నునొప్పిని తగ్గించుకోవడానికి ఖాళీ సమయంలో మెడ, వీపు, భుజాలకు సంబంధించిన వ్యాయామాలు చేయడం అలవాటు చేసుకోండి. ఇక ఆహారం విషయంలో అధిక కొవ్వు పదార్ధాలను దూరం పెట్టండి. అలాగే తగినంత నీరు తాగండి. తక్కువ కొవ్వు, కాల్షియం, ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల అవసరమైన ఖనిజాలు మీ బరువును అదుపులో ఉంచుతాయి. అలాగే వెన్నెముకపై ఉండే ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం  క్లిక్ చేయండి

అతడు ఐ లవ్ యూ చెప్పాడు.. నేను ఓకే అన్నాను.. అనుష్క శెట్టి..
అతడు ఐ లవ్ యూ చెప్పాడు.. నేను ఓకే అన్నాను.. అనుష్క శెట్టి..
న్యూ ఇయర్ వేళ ఎంఎంటీఎస్ ప్రత్యేక సర్వీసులు.. టైమింగ్స్ ఇవే..
న్యూ ఇయర్ వేళ ఎంఎంటీఎస్ ప్రత్యేక సర్వీసులు.. టైమింగ్స్ ఇవే..
ఈ పదార్థాలను ఇష్టంగా తింటున్నారా..? మీ గుండె డైరెక్టుగా షెడ్డుకే
ఈ పదార్థాలను ఇష్టంగా తింటున్నారా..? మీ గుండె డైరెక్టుగా షెడ్డుకే
ఆగిపోయిన పెళ్లిని జరిపించిన బ్లింకిట్.. 16 నిమిషాల్లో అద్భుతం..!
ఆగిపోయిన పెళ్లిని జరిపించిన బ్లింకిట్.. 16 నిమిషాల్లో అద్భుతం..!
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
‘మార్పు’ ఒక్కటే శాశ్వతం! అన్నీ ఈ పాతికేళ్ల ప్రస్థానంలోనే..
‘మార్పు’ ఒక్కటే శాశ్వతం! అన్నీ ఈ పాతికేళ్ల ప్రస్థానంలోనే..
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
అరుదైన ఎక్స్‌ప్రెస్‌వే టన్నెల్‌ నిర్మాణం
అరుదైన ఎక్స్‌ప్రెస్‌వే టన్నెల్‌ నిర్మాణం
తెల్ల జుట్టును నల్లగా మార్చే పవర్ ఈ ఆహారాలకు ఉందని తెలుసా?
తెల్ల జుట్టును నల్లగా మార్చే పవర్ ఈ ఆహారాలకు ఉందని తెలుసా?
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి