Dental Care: వీటిని తింటే దంతాల ఆరోగ్యం డేంజర్‌లో పడినట్లే.. వెంటనే దూరం పెట్టాల్సిందే
కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల దంతాలకు చాలా నష్టం వాటిల్లుతుంది. ముఖ్యంగా కొన్ని రకాల స్వీట్లు, మిఠాయిలు, క్యాండీలు దంత ఆరోగ్యానికి ప్రతి బంధకాలుగా పేర్కొంటారు.

దంతాలను శుభ్రంగా ఉంచుకోవడానికి రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం ఎంత ముఖ్యమో.. దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తీసుకునే ఆహారాలు కూడా అంతే ముఖ్యం. లేకపోతే పళ్లు రంగు మారిపోతాయి. అలాగే బ్యాక్టీరియా వృద్ధి చెంది చిగుళ్ల వ్యాధులు, దంత క్షయం వంటి తీవ్రమైన పంటి సమస్యలు కలుగుతాయి. దంతాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వాటిని బలంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అయితే కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల దంతాలకు చాలా నష్టం వాటిల్లుతుంది. ముఖ్యంగా కొన్ని రకాల స్వీట్లు, మిఠాయిలు, క్యాండీలు దంత ఆరోగ్యానికి ప్రతి బంధకాలుగా పేర్కొంటారు. వీటిల్లో మోతాదుకు మించి యాసిడ్‌లు ఉంటాయి. వీటిని నమలడం లేదా తినడం వల్ల దంతక్షయ సమస్యలు కలుగుతాయి. ఒకవేళ రుచిగా ఉండి మరీ వాటిని తినాలని అనిపిస్తే కొద్ది పాటి జాగ్రత్తలు తీసుకోవాలి. తిన్న తర్వాత బ్రష్‌తో శుభ్రంగా కడుక్కోవాలి.
ఉదాహరణకు మార్కెట్‌లో బ్రెడ్ కొనడానికి వెళ్లినప్పుడు ఖచ్చితంగా ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. మీరు వాటిని నమిలేటప్పుడు, మీ నోటిలోని లాలాజలం పిండి పదార్ధాన్ని మరింత చక్కెరగా ఉంచుతుంది. బ్రెడ్ మీ నోటిలో అంటుకునే పేస్ట్ లాంటి పదార్ధంగా మారినప్పుడు, అది దంతాలకు అంటుకుంటుంది. ఇది క్రమంగా కావిటీలకు దారితీస్తుంది. వీటిరి బదులుగా, తృణధాన్యాల పిండితో చేసిన బ్రెడ్ తినండి. ఆల్కహాల్ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని అందరికి తెలిసిందే. వీటిని తీసుకుంటే నోరు బాగా ఎండిపోతుందని మీకు తెలుసా? ఇది మన దంత సమస్యలకు దారి తీస్తుంది. దంత క్షయం, చిగుళ్ల వ్యాధి, ఇతర నోటి ఇన్ఫెక్షన్లను ముందుగానే గుర్తించాలి. లేకపోతే సమస్యలు మరింత తీవ్రంగా మారిపోతాయి.




మద్యం మానుకోవాల్సిందే!
ఇక సోడా, కార్బొనేటెడ్ డ్రింక్స్ కూడా దంతాలకు చాలా హానికరం. కార్బోనేటేడ్ సోడా దంతాలపై ఉండే ఎనామిల్‌పై దాడి చేస్తుంది. మీరు ఈ రకమైన డ్రింక్స్ తీసుకుంటే ఇందులోని యాసిడ్లు దంతాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. అలాగే ముదురు రంగు సోడా పానీయాలు మరింత హానికరం. తాగిన వెంటనే బ్రష్‌తో నోటిని శుభ్రం చేసుకోవాలి. లేకపోతే దంతాలు రంగుమారిపోతాయి. మనలో చాలామంది ఐస్ క్రీం తినడానికి ఇష్టపడతారు. అయితే ఇది మన దంతాలకు 2 విధాలుగా హాని చేస్తుంది. మొదట ఇందులోని తీపి దంత క్షయానికి దారితీస్తుంది అలాగే ఇది చాలా చల్లగా ఉంటుంది. ఇది దంతాల సెన్సిటివిటీని పెంచుతుంది. తేలికపాటి కోకో పౌడర్‌తో కలిపిన వేడి పాలను కూడా తాగవచ్చు. ఇది ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి