AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యమపురి వదిలి నడి రోడ్డుపైకి వచ్చేసిన యమ ధర్మరాజు, చిత్రగుప్తుడు.. చూసిన వారంతా షాక్..!

యమపురి వదిలి నడి రోడ్డుపైకి వచ్చేసిన యమ ధర్మరాజు, చిత్రగుప్తుడు.. చూసిన వారంతా షాక్..!

Pvv Satyanarayana
| Edited By: |

Updated on: Dec 30, 2025 | 9:13 AM

Share

రోడ్డు ప్రమాదాల నివారణకు కాకినాడ జిల్లా పోలీసులు వినూత్నంగా ప్రచారం చేపట్టారు. జగ్గంపేట సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో కళాకారులు తమ ప్రదర్శనతో నిబంధనలు పాటించని వాహనదారులకు సూచనలు చేశారు. యమ ధర్మరాజు, చిత్రగుప్తుడు వేషధారణతో ప్రధాన రహదారి, ఆర్టీసీ కాంప్లెక్స్, సంత మార్కెట్, కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద ప్రజలకు, వాహనదారులకు అవగాహన కల్పించారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు కాకినాడ జిల్లా పోలీసులు వినూత్నంగా ప్రచారం చేపట్టారు. జగ్గంపేట సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో కళాకారులు తమ ప్రదర్శనతో నిబంధనలు పాటించని వాహనదారులకు సూచనలు చేశారు. యమ ధర్మరాజు, చిత్రగుప్తుడు వేషధారణతో ప్రధాన రహదారి, ఆర్టీసీ కాంప్లెక్స్, సంత మార్కెట్, కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద ప్రజలకు, వాహనదారులకు అవగాహన కల్పించారు. తమ వేషాభాషలతో తెగ ఆకట్టుకున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే జరిగే పరియవసానం ఎలా ఉంటుందో హెచ్చరించారు.

అతివేగం వద్దు.. ప్రాణం ముద్దు, హెల్మెట్ ధరించు.. మరణాన్ని జయించు తదితర నినాదాలతో రద్దీ ప్రాంతాల్లో యమ ధర్మరాజు, చిత్రగుప్తుడు వేషధారణతో ఉన్న కళాకారులు ప్రచారం చేశారు. రానున్న డిసెంబరు 31, కొత్త సంవత్సరం, సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడపాలని సూచించారు. జగ్గంపేట పోలీసు సర్కిల్ పరిధిలోని ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొని వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Dec 30, 2025 09:12 AM