Air Pollution: పెరుగుతున్న కాలుష్యం.. మహిళల్లో వంధ్యత్వం.. పురుషుల్లో తగ్గుతోన్న స్పెర్మ్ కౌంట్.. ప్రమాదంలో అమ్మతనం..

వాయు కాలుష్యం కారణంగా పురుషులలో స్పెర్మ్ కౌంట్ నిరంతరం తగ్గుతూ వస్తోందని  నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జాగ్రత్తలు తీసుకోకుంటే రానున్న కాలంలో పరిస్థితి మరింత దిగజారుతుందని నిపుణులు చెబుతున్నారు.

Air Pollution: పెరుగుతున్న కాలుష్యం.. మహిళల్లో వంధ్యత్వం.. పురుషుల్లో తగ్గుతోన్న స్పెర్మ్ కౌంట్.. ప్రమాదంలో అమ్మతనం..
Fertility Rate India
Follow us

|

Updated on: Nov 03, 2022 | 6:57 PM

దేశ రాజధాని ఢిల్లీతో సహా దేశంలో అనేక ప్రాంతాల్లో వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలోనే ఉంది. ఈ వాతావరణ కాలుష్యం కారణంగా ప్రజలు అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ వాయు కాలుష్యం సంతానోత్పత్తిపై కూడా ప్రభావం చూపిస్తుందని మీకు తెలుసా. రోజు రోజుకీ పెరుగుతున్న వాయు కాలుష్యంతో మనుషుల లైంగిక ఆసక్తి, కార్యకలాపాలపై కూడా ప్రభావం చూపుతోందని వైద్యులు చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం..  వాయు కాలుష్యం .. స్త్రీ, పురుషులపై చెడు ప్రభావం చూపిస్తుందని.. సెక్స్ కోరికను 30 శాతం వరకు తగ్గిస్తుందని తెలుస్తోంది. వాయు కాలుష్యం కారణంగా పురుషులలో స్పెర్మ్ కౌంట్ నిరంతరం తగ్గుతూ వస్తోందని  నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జాగ్రత్తలు తీసుకోకుంటే రానున్న కాలంలో పరిస్థితి మరింత దిగజారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది పురుషుల్లో సంతానలేమి సమస్యను బాగా పెంచుతుందని చెబుతున్నారు.

టెస్ట్-ట్యూబ్ బేబీ (IVF) వరల్డ్ గ్రూప్ వ్యవస్థాపకులు, IVF నిపుణుడు డాక్టర్ గుంజన్ గుప్తా గోవిల్ మాట్లాడుతూ.. గాలిలో శరీరానికి హానికరం కలిగించే అనేక మూలకాలున్నాయని ..  ఇవి నేరుగా శరీరంలోని హార్మోన్లను ప్రభావితం చేస్తాయని చెప్పారు. ఈ హానికరమైన మూలకాల వలన భారతదేశంలో 15 శాతం మంది పురుషులు వంధ్యత్వానికి గురవుతున్నారని .. ఈ రేటు ప్రస్తుతం మహిళల కంటే ఎక్కువని పేర్కొన్నారు. వాయు కాలుష్యంలో పార్టికల్ మేటర్ 2.5 (pm2.5) పాలీసైక్లిక్ సుగంధ హైడ్రోకార్బన్‌లను కలిగి ఉన్నాయి. అంతేకాదు పాదరసం, కాడ్మియం, సీసం వంటి ప్రమాదకర మూలకాలను కలిగి ఉంది. ఇవి  హార్మోన్ల సమతుల్యతపై ప్రభావం చూపిస్తాయి. అంతేకాదు పురుషుల స్పెర్మ్‌కు హానికరమని గుంజన్ పేర్కొన్నారు. అనేక సందర్భాల్లో, కాలుష్యం టెస్టోస్టెరాన్ లేదా ఈస్ట్రోజెన్ స్థాయిని తగ్గిస్తుంది. అంతేకాదు స్త్రీ, పురుషుల్లో సెక్స్ పై ఆసక్తిని తగ్గిస్తుంది. కాలుష్యం కారణంగా స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందని పేర్కొన్నారు.

ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న అనేక రసాయనాలు కాలుష్యంతో ఉన్న గాలిని పీల్చుకోవడం వల్ల రక్తంలో ఫ్రీ రాడికల్స్ పెద్ద మొత్తంలో సేకరిస్తాయని డాక్టర్ గుంజన్ వివరించారు. దీంతో ఆరోగ్యకరమైన మగవారిలో కూడా స్పెర్మ్ నాణ్యతను తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కలుషిత గాలిలో ఉండే క్లోరిన్, డిడిటి వంటి రసాయనాలు మన ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయి. ఈ రసాయనాలు మన శరీరంలోకి చేరతాయి.. ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్ వంటి ముఖ్యమైన హార్మోన్లలో కలిసిపోతాయి.

ఇవి కూడా చదవండి

ఈస్ట్రోజెన్ మహిళలకు చాలా ముఖ్యమైన హార్మోన్. ఇది అండాశయాల్లో ఉత్పత్తి అవుతుంది. తరువాత రక్తంలో కలిసిపోతుంది. శరీరంలోని పునరుత్పత్తి అవయవాలను ప్రభావితం చేస్తుంది. ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది.. ఈస్ట్రోజెన్ లోపం ఏర్పడితే.. స్త్రీలలో అనేక శారీరక, మానసిక మార్పులు సంభవిస్తాయి. ఈస్ట్రోజెన్ లోపం వల్ల శారీరక సంబంధం పై ఆసక్తి తగ్గుతుంది. అదేవిధంగా టెస్టోస్టిరాన్ హార్మోన్ కూడా దెబ్బతింటోంది.

ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించమంటోన్న నిపుణులు:

ఎక్కువ నీరు త్రాగండి. ఇలా చేయడం వలన శ్వాసకోశ.. ఊపిరితిత్తులలో నిండిన దుమ్మును క్లియర్ చేయడంలో సహాయపడుతుంది.

ఎవరికైనా నిరంతరం తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ ధరించండి

అతినీలలోహిత కిరణాలను ఉత్పత్తి చేసే లైట్లు,  యంత్రాల వాడకాన్ని నివారించండి.

కొని రకాల మొక్కలను ఇంటి లోపల ఉంచవద్దు.. అందుకు బదులుగా ఎయిర్ ప్యూరిఫైయర్లను ఉపయోగించండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note : (ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు