AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఆధ్యాత్మిక జ్ఞానంతో దైవిక ఆనందం పొందడం ఎలా? సత్సంగ్‌ కన్వర్‌జేషన్‌ సిరీస్‌ వీడియో

కాలం ద్వారా ప్రతిధ్వనించిన సత్యాలు మన దైనందిన జీవితాల్లో సందర్భోచితంగా ప్రవహిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఆధునిక జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి అవసరమైన శాంతి, సమాధానం, కనెక్షన్లను అనుసంధానించడంలో భక్తి మార్గం ఉన్నతమైంది. ఇందుకు సత్సంగ్‌ కన్వర్‌జేషన్‌ సిరీస్‌ ఎంతో ఉపయోగపడుతున్నాయి..

Watch Video: ఆధ్యాత్మిక జ్ఞానంతో దైవిక ఆనందం పొందడం ఎలా? సత్సంగ్‌ కన్వర్‌జేషన్‌ సిరీస్‌ వీడియో
Satsang Conversation On Gods Bliss
Srilakshmi C
|

Updated on: Dec 30, 2025 | 9:19 AM

Share

కాలం ద్వారా ప్రతిధ్వనించిన సత్యాలు మన దైనందిన జీవితాల్లో సందర్భోచితంగా ప్రవహిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఆధునిక జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి అవసరమైన శాంతి, సమాధానం, కనెక్షన్లను అనుసంధానించడంలో భక్తి మార్గం ఉన్నతమైంది. ఇందుకు సత్సంగ్‌ కన్వర్‌జేషన్‌ సిరీస్‌ ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఇక్కడ జరిగే సుహృద్భావ చర్చలు, కాలాతీత జ్ఞానం, ఆచరణాత్మక అంతదృష్టులను అందిస్తుంది. మనలో ప్రేరణ, ఓదార్పు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వెలిగించటానికి ఓ స్పార్క్‌లా ఈ ఎపిసోడ్స్‌ సంభాషణలు ఉపయోగపడతాయి. ఈ సంభాషణలు ఆత్మను వెలిగించి, హృదయాన్ని సుసంపన్నం చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సిరీస్ లోతైన ఆధ్యాత్మిక పాఠాలను అన్వేషించడానికి ఒక ద్వారంగా పనిచేస్తుంది.

ఈ వారం ఎపిసోడ్‌లో ‘Enjoying Gods Bliss’ అనే అంశంపై మహేసనలోని BAPS స్వామినారాయణ మందిరంలో ప్రముఖ అధ్యాత్మికవేత్తలు చర్చలు జరిపారు. ఈ ప్రత్యేక చర్చాగోష్ఠిలో స్వామి యోగవివేకదాస్, స్వామి ఉత్తమయోగిదాస్, స్వామి గురుమానందాస్, స్వామి త్యాగపురుషదాస్ విలువైన సందేశాలను అందించారు. ఆధ్యాత్మిక సాధన, భక్తి మార్గం.. దైవిక ఆనందానికి పొందడానికి ఎలా తలుపులు తెరుస్తాయో, శాంతి – సంతృప్తితో నిండిన జీవితం వైపు మనల్ని ఎలా నడిపిస్తాయో ఎపిసోడ్‌లో వారివారి అంతర్దృష్టులను పంచుకున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..