AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆగిపోయిన పెళ్లిని జరిపించిన బ్లింకిట్.. 16 నిమిషాల్లో అద్భుతం.. డెలివరీ బాయ్‌కి సెల్యూట్‌ చేయాల్సిందే..!

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది అత్యంత ప్రధాన్యత కలిగిన వేడుక. ఇది వారి జీవితంలో మర్చిపోలేని, చిరకాల జ్ఞాపకం. అందుకే పెళ్లిని ప్రతిఒక్కరూ ఎప్పటికీ గుర్తుండిపోయేలా జరుపుకోవాలని కోరుకుంటున్నారు. అలాంటి పెళ్లిలో ఏదైనా ఒక చిన్న పొరపాటు కూడా పెద్ద ఒత్తిడి, తీవ్ర గందరగోళాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా పెళ్లి సందర్బంగా అత్యంత కీలకమైన వస్తువు సిందూర్ వంటి ముఖ్యమైన ఆచారం విషయానికి వస్తే అది ఎలా ఉంటుందో ఊహించలేం కూడా. కానీ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందులో వరుడు పెళ్లికి సిందూర్ తీసుకురావడం మర్చిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే...

ఆగిపోయిన పెళ్లిని జరిపించిన బ్లింకిట్.. 16 నిమిషాల్లో అద్భుతం.. డెలివరీ బాయ్‌కి సెల్యూట్‌ చేయాల్సిందే..!
Blinkit Sindoor Delivery
Jyothi Gadda
|

Updated on: Dec 31, 2025 | 9:21 PM

Share

భారతదేశంలో పెళ్లిళ్లు ఒక్కోప్రాంతంలో ఒక్కో ఆచారవ్యవహారాలతో నిర్వహిస్తారు. కొన్ని ప్రాంతాల్లో పెళ్లి అంటే, తాళిబొట్టు అతి ముఖ్యమైనది అంటారు. మరికొన్ని ప్రాంతాల్లో సిందూరం ప్రముఖ్యత కలిగి ఉంటుంది. అలాంటి సిందూరం లేకుండా పెళ్లి ఎలా జరిగింది..? అనే విషయానికి సంబంధించిన వార్త ఇది.  వైరల్‌ వీడియోలో పెళ్లి ఆచారాలకు ముందు వరుడు సిందూరాన్ని (కుంకుమ) తీసుకురావడం మర్చిపోయాడు. అది ఇంట్లోనే వదిలేసినట్లు గుర్తుకు వచ్చింది. ఈ విషయాన్ని వరుడు స్వయంగా కెమెరా ముందు చెబుతున్నాడు. పెళ్లి ఆచారాలు ప్రారంభం కానున్నాయి. సిందూర్‌ విషయంలో పెళ్లి వేడుకలో కుటుంబంలో కాస్త భయం, ఆందోళన వ్యాపించింది. సిందూరం లేకుండా వివాహ వేడుక అసంపూర్ణంగా భావిస్తారు. కుటుంబ సభ్యుల ముఖాల్లో ఆందోళన స్పష్టంగా కనిపించింది. అంతలోనే వరుడు చాకచక్యంగా వ్యవహరించాడు.

సిందూరం మ ర్చిపోయిన గందరగోళంలో వరుడు స్మార్ట్‌గా ఆలోచించాడు. బ్లింకిట్ ద్వారా సిందూర్ ఆర్డర్ చేశాడు. అంతే నిమిషాల్లో సిందూర్ పెళ్లి మండపానికి వచ్చేసింది. నిజంగా అంత త్వరగా వస్తుందా అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. కానీ, కేవలం 16 నిమిషాల్లోనే వారి సమస్య పరిష్కరించబడింది. సింధూరం రాగానే పెళ్లి మండపంలో చప్పట్లు మార్మోగాయి. వివాహ వాతావరణం మళ్ళీ ఆనందంతో నిండిపోతుంది. వధూవరులు హమ్మయ్యా అనుకుంటూ నిట్టూర్పు విడిచారు. ఆచారాలు ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగుతాయి.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ఈ బ్లింకిట్ వివాహ వైరల్ వీడియోను ప్రజలు చాలా సరదాగా భావిస్తున్నారు. చాలా మంది వినియోగదారులు ఈ వీడియో ఆధునిక సాంకేతికత శక్తిని, వేగవంతమైన డెలివరీ విధనాన్ని ప్రశంసిస్తున్నారు. కొందరు దీనిని స్మార్ట్ ఇండియాకు ఉదాహరణగా అభివర్ణించగా, మరికొందరు దీనిని ఒక ఫన్నీ ప్రమోషన్‌లో భాగం అంటున్నారు.

ఈ వైరల్ వీడియో నేటి స్పీడ్‌ డెలివరీ యాప్‌లు కేవలం సౌలభ్యం మాత్రమే కాదు, కష్ట సమయాల్లో నిజమైన సహాయకులుగా మారాయని చూపిస్తుంది. చిరస్మరణీయమైన వివాహం సందర్భంగా బ్లింకిట్ చేసిన 16 నిమిషాల డెలివరీ దీనిని నిరూపించింది… ఇక భయపడాల్సిన అవసరం లేదు.