Anusha Shetty : అతడు నాకు ప్రపోజ్ చేశాడు.. వెంటనే ఓకే చెప్పేశాను.. అనుష్క..
టాలీవుడ్ హీరోయిన్ అనుష్క గురించి చెప్పక్కర్లేదు. ఒకప్పుడు తెలుగు, తమిళం భాషలో చక్రం తిప్పిన జేజమ్మ.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది. ఎప్పుడో ఒక సినిమా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. చివరిసారిగా ఘాటి సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. కానీ ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది.

సాధారణంగా సినీ పరిశ్రమలో కొంతమంది నటీమణులు స్టార్డమ్ సంపాదించడమే కాకుండా అటు ప్రేక్షకుల హృదయాలను కూడా శాసిస్తున్నారు. అలాంటి హీరోయిన్లలో అనుష్క శెట్టి ఒకరు. పాన్ ఇండియా సినీప్రియుల మనసులలో దేవసేనగా చెరగని ముద్ర వేసింది. అందంతోపాటు అద్భుతమైన నటనతో జనాలను కట్టిపడేసింది. బాహుబలి సినిమాతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్న స్వీటీ.. ఆ తర్వాత మాత్రం సినిమాలు తగ్గించేసింది. కొన్నాళ్లు బ్రేక్ తీసుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు మరోసారి సినీప్రియులను అలరిస్తుంది. ఇటీవలే ఘాటీ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. లేడీ ఓరియెంటెడ్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం అనుష్క అటు ఇండస్ట్రీలో.. ఇటు సోషల్ మీడియాలో సైలెంట్ అయ్యింది. ప్రస్తుతం ఆమె వయసు 40 సంవత్సారాలు. ఇప్పటికీ పెళ్లి మాటెత్తకుండా సింగిల్ గా ఉంటుంది.
ఇవి కూడా చదవండి : Ranu Bombaiki Ranu Song : యూట్యూబ్ సెన్సేషన్.. రానూ బొంబాయికి రాను పాటకు ఎంత అమౌంట్ ఇచ్చారంటే.. డ్యాన్సర్ లిఖిత కామెంట్స్..
ఇదెలా ఉంటే.. గతంలో ఓ ఇంటర్వ్యూలో అనుష్క చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. తనకు 6వ తరగతిలోనే లవ్ ప్రపోజల్ వచ్చిందని.. ఐ లవ్ వ్యూ అనే మాటకు అర్థం తెలియక తాను కూడా సరే అన్నానని గుర్తుచేసుకుంది. “”నేను 6వ తరగతి చదువుతున్నాను. ఒక అబ్బాయి నా దగ్గరకు వచ్చి ‘ఐ లవ్ యు’ అని అన్నాడు. ఆ వయసులో, నాకు ఆ పదానికి అర్థం కూడా తెలియదు. కానీ అతను నన్ను అడిగినప్పుడు, నేను అమాయకంగా ‘సరే’ అని చెప్పాను. ఇప్పుడు అది తన జీవితంలో అందమైన జ్ఞాపకం” అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పుడు అనుష్క కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.
ఇవి కూడా చదవండి : Actor Suresh: సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. ఒక్క మాటలో చెప్పేసిన సీనియర్ హీరో..
సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. కానీ ‘అరుంధతి’ సినిమా ఆమెకు వేరే గుర్తింపును ఇచ్చింది. తెలుగుతోపాటు తమిళంలో స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు అందుకుంటూ తనదైన ముద్ర వేసింది. ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది.
ఇవి కూడా చదవండి : Folk Song : యూట్యూబ్లో కోట్ల వ్యూస్.. నెల రోజులుగా ఇంటర్నెట్ షేక్.. ఇప్పటికీ దూసుకుపోతున్న పాట..




