Laila Movie Review: లైలా మూవీ రివ్యూ.. లేడీ గెటప్‌తో విశ్వక్ సేన్ హిట్టు కొట్టాడా.. ?
వరసగా మాస్ సినిమాలు చేస్తున్న విశ్వక్‌సేన్ కాస్త స్టైల్ మార్చి చేసిన సినిమా ‘లైలా’. కెరీర్‌లో ఫస్ట్ టైమ్ అమ్మాయి గెటప్ వేసాడు ఈ సినిమా కోసం. మరి ఈ లైలా ఎలా ఉంది..? యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన లైలా.. నిజంగానే యూత్‌కు ఫుల్లుగా నచ్చిందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం.. వాలెంటైన్స్ డే సందర్బంగా అడియన్స్ ముందుకు వచ్చింది ఈ సినిమా.

మూవీ రివ్యూ: లైలా
నటీనటులు: విశ్వక్ సేన్, ఆకాంక్ష శర్మ, కామాక్షి భాస్కర్ల, పృథ్వీ, 30 ఇయర్స్ పృథ్వీ, అభిమన్యు సింగ్, వినీత్ కుమార్ తదితరులు
సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్
ఎడిటర్: సాగర్ దాడి
సంగీతం: లియోన్ జేమ్స్
స్క్రీన్ ప్లే, దర్శకుడు: రామ్ నారాయణ్
నిర్మాత: సాహు గరపాటి
వరసగా మాస్ సినిమాలు చేస్తున్న విశ్వక్‌సేన్ కాస్త స్టైల్ మార్చి చేసిన సినిమా ‘లైలా’. కెరీర్‌లో ఫస్ట్ టైమ్ అమ్మాయి గెటప్ వేసాడు ఈ సినిమా కోసం. మరి ఈ లైలా ఎలా ఉంది..? యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన లైలా.. నిజంగానే యూత్‌కు ఫుల్లుగా నచ్చిందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..
కథ:
సోను (విశ్వక్ సేన్) పాతబస్తీలో పేరు మోసిన ఓ బ్యూటీ పార్లర్ ఓనర్. సోను మేకప్ వేసాడంటే ఎలాంటి అమ్మాయైనా మెరిసిపోవాల్సిందే. అందుకే సోనూ అంటే చాలు ఆ ఏరియాలో అమ్మాయిలు, ఆంటీలు అంతా పడి చచ్చిపోతుంటారు. మరోవైపు సోనూకు ఆ పార్లర్ అంటే కేవలం బిజినెస్ మాత్రమే కాదు.. తన తల్లి జ్ఞాపకం. చిన్నప్పుడు అమ్మ (కీర్తి చావ్లా) ఎంతో కష్టపడి ఆ పార్లర్‌ను సోనూకు ఇస్తుంది. అలాంటి పార్లర్ జోలికి ఎవరొచ్చినా కూడా తాట తీస్తుంటాడు సోనూ. అలా సాగిపోతున్న సోనూ లైఫ్‌లోకి జిమ్ ట్రైనర్ జెన్నీ(ఆకాంక్ష శర్మ) వస్తుంది. ఆమెను ఫస్ట్ లుక్‌లోనే చూసి ప్రేమలో పడతాడు సోనూ. మరోవైపు SI శంకర్ (బబ్లూ పృథ్వీరాజ్)ను తన ఇద్దరు భార్యల దగ్గర రెడ్ హ్యాండెడ్‌గా పట్టిస్తాడు సోనూ. అది మనసులో పెట్టుకుని సోనూను చంపేయాలని తిరుగుతుంటాడు శంకర్. ఇక సోను మేకప్ వేసిన ఒక అమ్మాయిని చూసి రుస్తుం (అభిమన్యు సింగ్) ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత ఆమె నల్లగా ఉందని తెలిసి సోనుపై పగ పెంచుకుంటాడు సోనూ. ఇదే సమయంలో తన పార్లర్‌కు వచ్చే ఓ మహిళ కస్టమర్‌కు ఆయిల్ బిజినెస్‌కు హెల్ప్ చేస్తాడు. అదే ఇతన్ని ఆయిల్ కేసులో ఇరికిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది అసలు కథ..
కథనం:
హీరోలు లేడీ గెటప్ వేయడం ఇదేం కొత్తకాదు.. ఎప్పట్నుంచో ఉన్న ఆనవాయితే. కథ బాగుంటే అమ్మాయిగా మారిపోవడానికి కూడా ఓకే అంటారు మన హీరోలు. కానీ అది కథ బాగున్నపుడే.. అలా కాకుండా కేవలం గెటప్ కోసమే సినిమా తీస్తే అదెలా ఉంటుందో లైలాను చూస్తే అర్థమవుతుంది. విశ్వక్ సేన్ అంటే మనకు మాస్ సినిమాలే గుర్తుకొస్తాయి.. కానీ లైలాలో తనను తాను కొత్తగా చూపించుకోవాలని ఫిక్సైపోయి ఈ సినిమా చేసాడని అర్థమవుతుంది. కాకపోతే కథ విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉండుంటే బాగుండేది. కథనం కూడా అలాగే ఉంది. 80ల నాటి కథ తీసుకొచ్చి ఇప్పుడు చేస్తే అది అస్సలు రుచించకపోగా.. మరింత దిగజారుతుంది. సినిమాలో యూత్‌కు ఏం కావాలో అన్నీ ఉన్నాయన్నాడు విశ్వక్.. అంటే ఈ లెక్కన బూతు కామెడీ మాత్రమే సినిమాలో ఉంటే సరిపోతుందని చెప్పకనే చెప్పాడు ఈ హీరో. ఫస్టాఫ్ అంతా హీరో కారెక్టరైజేషన్, హీరోయిన్‌తో లవ్ ట్రాక్‌తో వెళ్లిపోతుంది. సెకండాఫ్ తనకు వచ్చిన సమస్యల నుంచి అధిగమించడానికి లేడీ గెటప్ వేయడం.. చివరికి ఎలా సమస్య నుంచి బయటపడ్డాడు అనేది క్లైమాక్స్. సినిమాలో పూర్తిగా హైదరాబాదీ స్టైల్ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా పాత బస్తీ ట్రెడీషన్స్ అన్నీ చూపించాడు. సినిమా అంతా డబల్ మీనింగ్ కామెడీతోనే ముందుకు వెళ్లిపోయింది. విశ్వక్ సేన్ లాంటి హీరో నుంచి ఇలాంటి సినిమా ఎక్స్‌పెక్ట్ చేయడం కాస్త కష్టమే. కొన్ని సీన్స్ చూస్తుంటే నిజంగానే విశ్వక్ ఈ సినిమా కథ విని ఓకే చేసాడా లేదంటే కేవలం లేడీ గెటప్ వేసి తన నటన చూపించాలని ఒప్పుకున్నాడా అనేది అర్థం కాదు.
నటీనటులు:
విశ్వక్ సేన్ గురించి ఏం చెప్పాలి..? స్టైలిష్‌గా ఉన్నాడు.. మాస్ సీన్స్‌లోనూ బాగా నటించాడు. లేడీ గెటప్‌లోనూ బాగానే ఉన్నాడు. కానీ కథ విషయంలో అస్సలు కేర్ తీసుకోలేదని అర్థమైంది. హీరోయిన్ ఆకాంక్ష శర్మను కేవలం గ్లామర్ షో కోసమే తీసుకున్నారు. 30 ఇయర్స్ పృథ్వీ, సీనియర్ నటుడు పృథ్వీ, వినీత్ కుమార్, అభిమన్యు సింగ్, కామాక్షి భాస్కర్ల వీళ్ళంతా ఉన్నారంటే ఉన్నారంతే. డబుల్ మీనింగ్ కామెడీతోనే ముందుకు వెళ్లిపోయింది సినిమా అంతా.
టెక్నికల్ టీం:
లియోన్ జేమ్స్ పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అంతగా అనిపించలేదు. సినిమాటోగ్రఫీ వర్క్ పర్లేదు. ఎడిటింగ్ కూడా వీక్ అనిపిస్తుంది. కేవలం 2 గంటల 16 నిమిషాల నిడివే ఉన్నా కూడా చాలా సేపు చూసిన ఫీల్ వస్తుంది. దర్శకుడు రామ్ నారాయణ్ తనకు వచ్చిన మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడు అనిపించింది. కథనం విషయంలో అస్సలు కేర్ తీసుకోలేదు.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా లైలా.. మరీ ఇలా ఎలా లైలా..?
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన