Upasana Konidela: వాలెంటైన్స్ డే.. మీ కోసం కాదు.. వాళ్లకు మాత్రమే.. ఉపాసన ఫన్నీ పోస్ట్..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల సోషల్ మీడియాలో ఎంతగా యాక్టివ్ గా ఉంటారో చెప్పక్కర్లేదు. నిత్యం ఏదోక అంశం గురించి ఆసక్తికర పోస్టులు చేస్తుంటారు. అలాగే అప్పుడప్పుడు చరణ్ సినిమాలపై సైతం స్పందిస్తుంటారు. తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా మెగా కోడలు ఫన్నీ పోస్ట్ చేసింది.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఏదోక పోస్ట్ చేస్తుంటారు. అలాగే అప్పుడప్పుడు చరణ్, క్లింకారకు సంబంధించిన ఫోటోస్, మూవీ అప్డేట్స్ పై షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆక్టట్టుకుంటారు. తాజాగా ప్రేమికుల దినోత్సవం సందర్బంగా మెగా కోడలు ఉపాసన ఆసక్తికర పోస్ట్ చేసింది. వాలెంటైన్స్ డేకు సరికొత్త అర్థం చెబుతూ ఉపాసన షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది. ఫిబ్రవరి 14న కేవలం కొందరి కోసమే అంటూ ఫన్నీగా పోస్ట్ చేసింది. ఇది చూసిన నెటిజన్స్ ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ఇంతకీ ఉపాసన ఏం పోస్ట్ చేసిందో తెలుసా.. ?
ప్రస్తుతం ఉపాసన కొణిదెల చేసిన పోస్ట్ నవ్వులు పూయిస్తుంది. “వాలెంటైన్స్ డే అనేది 22 ఏళ్లు. అంతకంటే తక్కువ వయసు ఉన్న అమ్మాయిలకు సంబంధించినది. మీరు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు అయితే.. ఆంటీ దయచేసి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కోసం ఎదురుచూడండి” అంటూ పోస్ట్ చేశారు ఉపాసన. ఆమె పోస్టుకు స్మైలీ ఎమోజీలను సైతం జత చేయడంతో నెట్టింట వైరలవుతుంది. ఉపాసన పోస్ట్ పై నెటిజన్స్ క్రేజీగా రియాక్ట్ అవుతున్నారు.
ఇక చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే సంక్రాంతి కానుకగా గేమ్ ఛేంజర్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ యాక్షన్ చిత్రంలో కియారా అద్వానీ, అంజలి, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ కీలకపాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకుంది. ప్రస్తుతం చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబు సరన దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.

Upasana Konidela
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన