సినిమా ఇండస్ట్రీని వీడని విషాదాలు.. ఐదు నెలల్లో ఆరుగురి దిగ్గజాల కన్నుమూత.. కన్నీళ్లు పెట్టుకుంటోన్న కళామతల్లి

సినిమా ఇండస్ట్రీకి ఏమైనా అరిష్టం పట్టుకుందా? గత కొన్ని నెలలుగా పరిశ్రమ పరిస్థితి చూస్తుంటే ఇదే నిజమనిపిస్తోంది. తమ ప్రతిభా నైపుణ్యంతో కళామతల్లికి సేవలు చేసిన దిగ్గజాలు ఒక్కొక్కరు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నారు.

సినిమా ఇండస్ట్రీని వీడని విషాదాలు.. ఐదు నెలల్లో ఆరుగురి దిగ్గజాల కన్నుమూత.. కన్నీళ్లు పెట్టుకుంటోన్న కళామతల్లి
K.viswanath , Heroine Jamuna , Kaikala Satyanarayana , Hero Krishna , Krishnam Raju , Vani Jayaram
Follow us

|

Updated on: Feb 04, 2023 | 4:37 PM

సినిమా ఇండస్ట్రీకి ఏమైనా అరిష్టం పట్టుకుందా? గత కొన్ని నెలలుగా పరిశ్రమ పరిస్థితి చూస్తుంటే ఇదే నిజమనిపిస్తోంది. తమ ప్రతిభా నైపుణ్యంతో కళామతల్లికి సేవలు చేసిన దిగ్గజాలు ఒక్కొక్కరు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నారు. కృష్ణం రాజు .. కృష్ణ .. కైకాల సత్యనారాయణ .. జమున.. కే విశ్వనాథ్‌. ఇలా అయిదు నెలల్లో ఐదుగురు కళామతల్లి బిడ్డలు కన్నుమూశారు. వీరితో పాటు సీనియర్‌ దర్శకుడు సాగర్‌, నటుడు చలపతిరావు కూడా మనల్ని విడిచి వెళ్లిపోయారు. ఇప్పుడు వాణీ జయరాం. వృద్ధాప్యం మీద పడితే మరణం అనివార్యం అన్నట్లు ఇలా ఒక్కొక్కరు శాశ్వత నిద్రలోకి వెళుతుండడంతో కళామతల్లి కన్నీళ్లు పెట్టుకుంటోంది. గతేడాది సెప్టెంబర్‌లో రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు హఠాన్మరణంతో మొదలైన విషాదాల పరంపర ఇప్పటికీ కొనసాగుతోంది. హీరోగా, విలన్‌గా ఆతర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణించి గంభీరమైన పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయిన రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు 2022 సెప్టెంబర్ 11న తుది శ్వాస విడిచారు. ఆతర్వాత సూపర్‌ స్టార్‌ కృష్ణ నవంబర్‌ 15న కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన ఆయన మరణం కుటుంబ సభ్యులతో పాటు అభిమానులను శోక సంద్రంలోకి నెట్టింది.

ఇక విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా హీరోలతో సమానంగా క్రేజ్‌ తెచ్చుకున్న కైకాల సత్యనారాయణ 2022 డిసెంబర్ 22వ తేదీన కన్నుమూశారు. ఇక 1200కు పైగా సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించిన చలపతి రావు 2022 డిసెంబర్ 25న కన్నుమూశారు. అలా 2022 సంవత్సరం సినిమా ఇండస్ట్రీకి గడ్డుకాలంగా మిగిలిపోయింది. ఇక కొత్త ఏడాదిలో తెలుగు తెర సత్యభామ సీనియర్ నటి జమున హఠాన్మరణం అందరినీ షాక్‌కు గురిచేసింది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషా సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన ఈ సీనియర్‌ నటీమణి జనవరి 27న తుది శ్వాస విడిచారు. ఇక కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సీనియర్‌ దర్శకుడు సాగర్ (70) చెన్నైలో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఫిబ్రవరి 2న ఆయన శాశ్వాత నిద్రలోకి జారుకున్నారు. ఇక దిగ్గజ దర్శకుడు కళాతపస్వి కె. విశ్వనాథ్‌ (92) అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం (ఫిబ్రవరి 2) తుది శ్వాస విడిచారు.

ఇవి కూడా చదవండి

విశ్వనాథ్ అంత్యక్రియలు పూర్తయ్యి 24 రోజులు గడవక ముందే సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. తన గాన ప్రతిభతో సినీ ప్రియులను అలరించిన దిగ్గజ సంగీత దర్శకురాలు వాణీ జయరాం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దీంతో సినిమా ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..