పనిమనిషిని నమ్మితే నిలువునా ముంచేసింది.. దారుణంగా మోసం చేసిందన్న ప్రసాద్ బెహరా
ప్రసాద్ బెహరా.. తెలుగు ప్రేక్షకులు ముఖ్యంగా సోషల్ మీడియా వాడే వాళ్లకు ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యూట్యూబ్‌లో చాలా ఫెమస్ ఇతను. చాలా షార్ట్ ఫిలిమ్స్‌లో నటించాడు. ముఖ్యంగా కామెడీ ప్రధానంగా షార్ట్ ఫిలిమ్స్‌ను తెరకెక్కిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.

షార్ట్ ఫిలిమ్స్ ద్వారా చాలా మంది సినిమాల్లోకి అడుగుపెడుతున్నారు. అలా వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు నటుడు ప్రసాద్ బెహరా. కమిటీ కుర్రాళ్లు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే ఇటీవల మిత్రమండలి అనే సినిమాతో ప్రేక్షకులను అలరించారు ప్రసాద్ బెహరా.. ప్రసాద్ బెహరా ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన విడాకుల గురించి అలాగే జీవితంలో తనకు ఎదురైన ఓ షాకింగ్ సంఘటన గురించి పంచుకున్నారు ప్రసాద్.
మహేష్, పవన్ కళ్యాణ్ అలా.. ప్రభాస్ ఇలా..! స్టార్ హీరోల గురించి ప్రభాస్ శ్రీను ఏమన్నారంటే
ఈ ఇంటర్వ్యూలో ప్రసాద్ మాట్లాడుతూ..తాను మనుషులను త్వరగా నమ్మే తన స్వభావం వల్ల తాను గతంలో ఎలా ఇబ్బందులు పడ్డాడో వివరించారు. తన విడాకుల తర్వాత ప్రసాద్ ఒంటరితనాన్ని అనుభవిస్తున్న రోజుల్లో, ఒక పనిమనిషిని నియమించుకున్నారట. ఆమెకు జీతంగా నెలకు 3000 రూపాయలు అడిగితే, ప్రసాద్ దానికి రెట్టింపు, అంటే 6000 రూపాయలు ఇస్తానని చెప్పారట. ఆమె పని గిన్నెలు కడగడం, ఇల్లు శుభ్రం చేయడం మాత్రమే కాకుండా, ప్రసాద్‌తో కబుర్లు చెప్పి, ఒంటరితనాన్ని దూరం చేయడమే ప్రధానంగా ఉండేది. పనిమనిషిని “అక్కా” అని ఆప్యాయంగా పిలిచేవార ప్రసాద్. ప్రసాద్ ఆమె పట్ల చూపిన ఉదారత కేవలం జీతంతో ఆగిపోలేదు. ప్రతి వారం ఆమె కుటుంబానికి ఒక కేజీ మటన్‌ను కొనిచ్చేవాడు. అంతేకాకుండా, వారానికి ఒకసారి ఆమె కుటుంబం మొత్తం కలిసి సినిమా చూడటానికి నాలుగు రెక్లైనర్ సీట్లకు టికెట్లు కూడా కొనిచ్చేవారు. నెలవారీ సరుకులు కావాలని అడిగితే, ప్రసాద్ స్వయంగా వెళ్లి కార్డు స్కాన్ చేసి, ఆమెకు కావాల్సిన సరుకులన్నీ కొనిచ్చేవారట. ఈ విధంగా ఆమెను తన కుటుంబ సభ్యురాలిగా, అత్యంత నమ్మకమైన వ్యక్తిగా చూసుకున్నారు. ఆమెతో కలిసి కథలు చెప్పుకుంటూ, తన కష్టాలను పంచుకుంటూ కాలం గడిపేవాడిని అని చెప్పారు.
ఆ టైంలో చనిపోతా అనుకున్నా.. ఆయనే సాయం చేశారు.. ఎమోష్నలైన పోసాని
అదే సమయంలో ప్రసాద్‌కు వాచీలు కొనే అలవాటు బాగా పెరిగింది. ఆయన 60, 70 వేల రూపాయల విలువైన వాచీలను కొనుగోలు చేశారట. అయితే, ఒకరోజు ఆయన వాచీలు కనిపించకుండా పోవడం ప్రారంభించాయి. మొత్తం నాలుగు వాచీలు పోయాయని ఆయన తెలిపారు. చివరికి, తన విలువైన యాపిల్ వాచ్ కూడా కనిపించలేదట. ఒకరోజు పనిమనిషి ఆ యాపిల్ వాచ్‌ను తన చీర కొంగుకు కట్టుకుని బయటకు వెళ్తుండగా, సెక్యూరిటీ బజర్ మోగింది. దీంతో ఆమె దొరికిపోయింది. ప్రసాద్ ఆమెను పిలిచి అడగ్గా, పనిమనిషి ఎటువంటి పశ్చాత్తాపం లేకుండా సమాధానం ఇచ్చింది. దొంగిలించిన వాచీలలో ఒకదానికి 400 రూపాయలు అమ్మను అని చెప్పిందట, అయితే మొత్తం వాచీల విలువ లక్షన్నర రూపాయలు ఉంటుందని ప్రసాద్ చెప్పారు. ఈ ఘటనతో ప్రసాద్ తీవ్రంగా బాధపడ్డారట. అయినప్పటికీ, ఆమెను తిట్టకుండా, కేవలం ఇకపై ఇటువైపు రావద్దు అని చెప్పి పంపించేశారట. ఆమె కుటుంబ సభ్యులు వచ్చి బతిమాలినప్పటికీ, ప్రసాద్ ఆమెను తిరిగి పనిలో పెట్టుకోవడానికి నిరాకరించారు. మనుషులను నమ్మే తన స్వభావం వల్ల ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని చెప్పుకొచ్చారు ప్రసాద్ బెహరా..
ఒకే రోజు పెళ్లి చేసుకున్న ప్రాణస్నేహితులు.. తెలుగులో ఇద్దరూ తోపులే.. వాళ్లు ఎవరంటే
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.




