Prabhutva Sarai Dukanam : ప్రభుత్వ సారాయి దుకాణం చిత్రంపై మహిళా సమైక్య ప్రతినిధి ప్రెసిడెంట్స్ కంప్లైంట్.. ఏం జరిగిందంటే..
2008లో ‘1940లో ఒక గ్రామం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన డైరెక్టర్ నంది.. ఇప్పుడు మరో సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఫస్ట్ మూవీతోనే నేషనల్ ఫిల్మ్ అవార్డ్ అందుకుని జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న ఆయన.. ఇప్పుడు తెరకెక్కిస్తున్న కొత్త సినిమా ప్రభుత్వ సారాయి దుకాణం. తాజాగా ఈ మూవీ విడుదలకు ముందే వివాదంలో చిక్కుకుంది.

జాతీయ అవార్డు గ్రహీత నరసింహ నంది రచనా దర్శకత్వంలో ఎస్వీఎస్ ప్రొడక్షన్స్ శ్రీనిధి సినిమాస్ బ్యానర్ పై దైవ నరేష్ గౌడ, పరిగి స్రవంతి మల్లిక్ నిర్మాతలుగా ప్రేక్షకులు ముందుకు రారన్న చిత్రం ప్రభుత్వ సారాయి దుకాణం. ఇటీవల ఈ చిత్ర టీసర్ విడుదల కావడం జరిగింది. అయితే ఆ టీజర్ లోని డైలాగులు కొంత అసభ్యకరంగా ఉన్నాయంటూ చర్చలు వినిపించాయి. అలాగే ఈ చిత్ర టీచర్ లో తెలంగాణ యాసను దుర్వినియోగం చేస్తూ ఆడవారిని అవమానిస్తూ డైలాగులు ఉన్నాయంటూ నేడు కొంతమంది మహిళలు స్పందించడం జరిగింది. తెలుగు ఫిలిమ్ ఛాంబర్ ప్రధాన కార్యదర్శి దామోదర ప్రసాద్ గారిని కలిసి మహిళా సమైక్య ప్రతినిధులు కంప్లైంట్ చేయడం జరిగింది.
ఇవి కూడా చదవండి : Serial Actress: అబ్బబ్బో.. అదరగొట్టేస్తోన్న రుద్రాణి అత్త.. నెట్టింట గ్లామర్ గత్తరలేపుతున్న సీరియల్ విలన్..
ఈ సందర్భంగా మహిళా సమైక్య ప్రతినిధి దీపా దేవి గారు మాట్లాడుతూ… “ప్రభుత్వ సారాయి దుకాణం అనే చిత్ర టీజర్ లో మహిళలను కించపరుస్తూ డైలాగులు ఉన్నాయి. తెలంగాణలోని మహిళలు ఎంత నీచంగా మాట్లాడుతారా? అంతేకాక ఆడవారితో కూడా అటువంటి బూతులతో కూడిన డైలాగులు చెప్పించారు. భవిష్యత్తును ఎటు తీసుకువెళ్దాం అనుకుంటున్నారు? తెలంగాణ సంస్కృతిని, సాంప్రదాయాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ చిత్రం విడుదలయితే మేము ఊరుకోము, ఖబర్దార్. దర్శకుడు జాతీయ అవార్డు గ్రహీత ఇటువంటి చిత్రాలు తీయడం అనేది చాలా తప్పు. మహిళలు మీకు అలా కనిపిస్తున్నారా? రాజకీయాలలోని మహిళల గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఈ సినిమాను విడుదల కానివ్వము. అవసరమైతే సంసార్ బోర్డును ముట్టడిస్తాం” అన్నారు.
ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, కమల్ హాసన్‌తో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు విదేశాల్లో వ్యాపారాలు.. ఈ బ్యూటీ క్రేజ్ వేరప్పా..
మరొక మహిళ సమైక్య ప్రతినిధి నీరజ గారు మాట్లాడుతూ… “రోజురోజుకు సినిమాలు తీసే విధానం దిగజారిపోతుంది. కేవలం డబ్బులు సంపాదించుకోవడం కోసం ఎలా పడితే అలా సినిమా తీస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ సారాయి దుకాణం అనే టైటిల్ తో వస్తున్న చిత్రంలో తెలంగాణ యాసను అవమానిస్తున్నారు. ప్రపంచమంతా మన తెలంగాణ అభివృద్ధిని చూస్తుంటే ఇటువంటి నిజమైన భాషతో ఆడవారిని దూషిస్తూ ఇటువంటి సినిమాలు తీయడం, యువతను తప్పుదారి పట్టించేలా ఇటువంటి సినిమాలు తీయడం మంచిది కాదు. జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకుడు ఇటువంటి చిత్రాలు చేయడం అనేది సరైనది కాదు. మీ ఇంట్లో ఆడవారు ఇటువంటి బూతులతో కూడిన భాషను ఉపయోగిస్తే మీరు ఊరుకుంటారా? ఈ సినిమాను నిలిపివేయకపోతే దర్శకుడు ఇంటిని ముట్టడిస్తాం. డబ్బు కోసం ఇటువంటి సినిమాలను చేయకండి” అన్నారు.
ఇవి కూడా చదవండి : 43 ఏళ్ల వయసులో ఇంత స్లిమ్‌గా.. ఈ హీరోయిన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనట..
ధనమ్మ గారు మాట్లాడుతూ… “ఎంతో గౌరవంగా ఎన్నో పండుగలు వ్యవహరించే తెలంగాణ మహిళలను కించపరుస్తూ ఇటువంటి సినిమాలు చేయకండి. ప్రభుత్వ సారాయి దుకాణం సినిమాలో ఎన్నో బూతులు ఉన్నాయి. ఈ సినిమాను వెంటనే నిలిపివేయాలని కోరుతున్నాము. లేదంటే చాంబర్ ను, సెన్సార్ బోర్డును ముట్టడిస్తాము” అని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఫిలిం ఛాంబర్ ముఖ్య కార్యదర్శి తమాత్ర ప్రసాద్ గారికి ఈ చిత్రాన్ని వెంటనే నిలిపివేయాలని కోరుతూ మహిళా సమస్యల ప్రతినిధులు దీపా దేవి, పద్మ, నీరజ, ధనమ్మ, చంద్రమ్మ, నసీమా తదితరులు వినతిపత్రం అందజేశారు.
ఇవి కూడా చదవండి : ఆ ఒక్క జ్యూస్.. 51 ఏళ్ల వయసులో మలైక అందం వెనుక రహస్యం ఇదేనట.








