Dhruv Vikram: విక్రమ్ తనయుడు హీరోగా సక్సెస్ అవుతారా..?
విక్రమ్ తనయుడు హీరోగా సక్సెస్ అవుతారా..? ఇప్పటికే రెండు సినిమాలు చేసినా.. కోరుకున్న గుర్తింపు తెచ్చుకోవడంలో విఫలమయ్యారు ధృవ్. మరి ఇలాంటి సమయంలో వస్తున్న బైసన్ ఆయన నమ్మకం నిలబెడుతుందా లేదా..? బైసన్ సినిమాతో ధృవ్ ఏం మ్యాజిక్ చేయబోతున్నారు..? తెలుగులోనూ ఈ సినిమా విడుదల కానుందా..? తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ అర్జున్ రెడ్డి రీమేక్ ఆదిత్య వర్మతో హీరోగా పరిచయం అయ్యారు.
అది పెద్దగా ఆకట్టుకోలేదు.. ఆ తర్వాత తండ్రి విక్రమ్‌తో కలిసి నటించిన మహాన్ సినిమాలో కూడా మంచి ప్రదర్శన కనబరిచినా.. అది ఓటిటికి పరిమితమైంది. ప్రస్తుతం తన మూడవ సినిమా బైసన్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు ధృవ్. సెన్సేషనల్ డైరెక్టర్ మారి సెల్వరాజ్ దర్శకత్వంలో కబడ్డీ నేపథ్యంలో వస్తున్న బైసన్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ధృవ్ కెరీర్‌ను ఈ సినిమా డిసైడ్ చేయబోతుంది. అందుకే ఇదే నా మొదటి సినిమా అంటూ బైసన్ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు ధృవ్. కర్ణన్, మామన్నన్ లాంటి సినిమాల తర్వాత మారి నుంచి వస్తున్న సినిమా ఇది. తన సినిమాల్లో బలమైన కథలతో పాటు సామాజిక అంశాలను శక్తివంతంగా చూపిస్తుంటారు మారి సెల్వరాజ్. గ్రామీణ నేపథ్యంలో అణగారిన వర్గాల పోరాటం, కబడ్డీ నేపథ్యం, పాలిటిక్స్ ఫుల్ యాక్షన్ బైసన్ ట్రైలర్‌లో కళ్ల ముందు కనిపిస్తున్నాయి. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. అక్టోబర్ 17న తమిళంలో.. 24న తెలుగులో విడుదల కానుంది ఈ చిత్రం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Madhavan: 50 ప్లస్ లో దూకుడు చూపిస్తున్న మాధవన్
సీన్ రివర్స్.. టికెట్ రేట్లపై మళ్లీ బాంబు
వేలకోట్లకు అధిపతి.. అయినా సైకిల్‌పైనే సవారీ
భారత్‌లోనే రిచ్చెస్ట్ మహిళ రోష్ని.. ఆస్తి విలువ తెలిస్తే మైండ్ బ్లాకే
గబ్బిలాలకు పూజలు చేసే గ్రామం.. ఎందుకో తెలుసా ??
200 ఏళ్ల నాటి అరుదైన శంఖం... ఏడాదికి ఒక్కసారే...
ప్రియుడి భార్య ఎంట్రీ..10వ అంతస్తు లో వేలాడిన ప్రియురాలు
ప్రపంచంలోనే 'లాంగెస్ట్' ఫ్లైట్ చూసారా..
నెలకు రూ. 8 వేలు జీతం.. కానీ రూ.13 కోట్ల జీఎస్టీ నోటీసు అందుకుంది
ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చారు.. కళ్లలో స్ప్రే కొట్టి..
యూట్యూబ్ చూసి ఆపరేషన్.. చివరికి..

