Madhavan: 50 ప్లస్ లో దూకుడు చూపిస్తున్న మాధవన్
ఒకప్పటి అమ్మాయిల కలల హీరో.. ఇప్పుడేమో మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్.. భాషతో పనిలేదు.. అన్నిచోట్లా ఆయన జపమే..! హిందీలో అయితే మరీనూ.. ఆయన కోసమే కథలు రాస్తున్నారక్కడ. సౌత్ నుంచి వెళ్లి నార్త్‌లో రఫ్ ఆడిస్తున్నారు.. రప్పా రప్పా అంటూ వరస అవకాశాలు అందుకుంటున్నారు. మరి అన్నిచోట్లా అదరగొడుతున్న ఆ నటుడు ఎవరో తెలుసా..? ఆర్ మాధవన్.. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేని పేరు.
తమిళ హీరోగా మొదలైన ఈయన ప్రయాణం.. ఇప్పుడు ప్యాన్ ఇండియా అయిపోయింది. హిందీలో మాధవన్ జోరు మామూలుగా లేదిప్పుడు. ఆయన కోసమే కథ రాస్తున్న దర్శకులు కూడా ఉన్నారు. మొన్న కేసరి 2లో అద్భుతమైన పాత్ర చేసిన మాధవన్.. తాజాగా దేదే ప్యార్ దే అంటూ వస్తున్నారు. తెలుగు తమిళం అని తేడా లేదు. అన్నిచోట్లా రప్ఫాడిస్తున్నారు మాధవన్. ముఖ్యంగా హిందీలో మాధవన్ బిజీగా ఉన్నారు. ఏడాదికి అరడజన్ సినిమాలకు పైగానే నటిస్తున్నారీయన. ఆ మధ్య ఆప్ జైసే హోతో పాటు కేసరి 2లో అద్భుతంగా నటించిన మ్యాడీ.. దేదే ప్యార్ దే 2లో అదరగొట్టారు. దాంతో పాటు రణ్‌వీర్ సింగ్ ధురందర్ సినిమా చేస్తున్నారు. డిఫెరెంట్ క్యారెక్టర్స్‌తో దూసుకుపోతున్నారు మాధవన్. తాజాగా ఈయనకు తెలుగు నుంచి అదిరిపోయే ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. రాజమౌళి, మహేష్ కాంబినేషన్‌లో వస్తున్న SSMB29లో హీరో తండ్రి పాత్రకు మాధవన్‌ని తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి భాషతో సంబందం లేకుండా అన్నిచోట్లా అదరగొడుతున్నారు మ్యాడీ.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సీన్ రివర్స్.. టికెట్ రేట్లపై మళ్లీ బాంబు
వేలకోట్లకు అధిపతి.. అయినా సైకిల్‌పైనే సవారీ
భారత్‌లోనే రిచ్చెస్ట్ మహిళ రోష్ని.. ఆస్తి విలువ తెలిస్తే మైండ్ బ్లాకే
Nayanthara: నయనతార అందుకే నెం.1 హీరోయిన్
హైకోర్టులో హీరోకు వింత అనుభవం.. నవ్వాలో.. ఏడవాలో తెలియని పరిస్థితి
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

