భారత్‌లోనే రిచ్చెస్ట్ మహిళ రోష్ని.. ఆస్తి విలువ తెలిస్తే మైండ్ బ్లాకే
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఛైర్‌పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. భారతదేశంలో అత్యంత సంపన్న మహిళగా అగ్రస్థానంలో నిలవడమే కాకుండా, దేశంలోని టాప్ 10 కుబేరుల జాబితాలో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించారు. భారత్‌లో సంపన్నులకు సంబంధించి 2025 సంవత్సరానికి గాను జాబితాను ప్రముఖ సంస్థ ఎం3ఎం హురున్ ఇండియా విడుదల చేసింది.
ఈ నివేదిక ప్రకారం, రోష్ని నాడార్ మల్హోత్రా సంపద విలువ ఏకంగా రూ. 2.84 లక్షల కోట్లుగా ఉన్నట్లు అంచనా వేశారు. దీంతో ఆమె భారత మహిళా పారిశ్రామికవేత్తల్లో మొదటి స్థానంలో నిలిచారు. దేశంలోని టాప్ 10 మంది అత్యంత ధనవంతుల జాబితాను పరిశీలిస్తే, అందులో అతి తక్కువ వయసున్న వ్యక్తిగా రోష్ని నాడార్ నిలవడం గమనార్హం. టెక్నాలజీ రంగంలో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్న ఆమె, దేశంలోని యువ పారిశ్రామికవేత్తలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సంపన్నుల జాబితాలో ముకేశ్ అంబానీ రూ.9.55లక్షల కోట్లతో తొలి స్థానంలో నిలిచారు. రూ.8.15 లక్షల కోట్లతో రెండో స్థానంలో గౌతమ్ అదానీ ఆయన కుటుంబం ఉంది. మూడో స్థానంలో హెచ్‌సీఎల్‌టెక్ ఛైర్‌పర్సన్ రోష్నీ నాడార్ మల్హోత్రా రూ.2.84లక్షల కోట్లతో నిలిచారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Nayanthara: నయనతార అందుకే నెం.1 హీరోయిన్
హైకోర్టులో హీరోకు వింత అనుభవం.. నవ్వాలో.. ఏడవాలో తెలియని పరిస్థితి
OTTలోకి సూపర్ హిట్ మూవీ కొత్తలోక
నరేష్‌కు కాబోయే భార్య ఈమే.. త్వరలో పెళ్లి
డాన్స్ కాదు..చిన్నపాటి రొమాన్స్.. పవన్ తీరుతో.. మొఖం మాడ్చుకున్న రీతూ
అప్పుడు కల్యాణానికి వజ్రాల తలంబ్రాలు.. కట్ చేస్తే ఇప్పుడు వేట
ఒంట్లో ఉన్న దెయ్యాన్ని పోగొట్టాలని.. కోడలితో బలవంతంగా
ఫ్రైడ్ రైస్‌లో బొద్దింకషాకైన కస్టమర్లు
సెంట్రల్ జైల్లో ఖైదీల రాజభోగాలు..!
కళ్లు చెదిరేంత బంగారం దొరికినా కన్నెత్తి చూడలేదు..
అక్కను వేధిస్తున్నాడని బావను చంపిన బావమరుదులు
పేకాట రాయుళ్లకు కోర్టు.. శ్రీకాకుళం కోర్ట్ వినూత్న శిక్ష

