OTTలోకి సూపర్ హిట్ మూవీ కొత్తలోక
కొత్త లోక! థియేటర్లలో రిలీజ్ కు ముందు ఎలాంటి అంచనాలు లేవు ఈ సినిమాపై. ఈ సినిమాలో.. స్టార్ హీరోలు లేరు. పైగా చిన్న సినిమా అనే ట్యాగ్ కూడా ఉంది. పెద్దగా ప్రమోషన్లు కూడా చేయలేదు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కొత్త లోక సినిమాన బాక్సాఫీస్ ను షేక్ చేసింది. స్టార్ హీరోల సినిమాలను వెనక్కు నెడుతూ భారీ వసూళ్లు రాబట్టింది.
ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు, అబ్బుర పరిచే యాక్షన్ సీన్స్, ఊహించని ట్విస్టులు ఈ సినిమాకు కాసుల వర్షం కురిపించాయి. కేవలం రూ. 30 కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టి తీసిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇందులో భాగమైన యాక్టర్స్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. మలయాళంలో ఇప్పటికీ చాలా చోట్ల ఈ సినిమా థియేటర్లలో ఆడుతోంది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమాను ఎప్పుడెప్పుడు ఓటీటీలో చూద్దామా? అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వారి నిరీక్షణకు తెర పడింది. త్వరలోనే ఈ సెన్సేషనల్ మూవీ ఓటీటీలోకి రానుంది. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఆగష్టు 28న థియేటర్లలో విడుదలై రిలీజైన కొత్త లోక సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ తో పాటు ప్రేమలు మూవీ ఫేమ్ నస్లేన్, డాన్స్ మాస్టర్ శాండీ, విజయరాఘవన్, సంధు సలీంకుమార్, రఘునంద పలేరి, శివాజిత్ పద్మనాభన్, జైన్ ఆండ్రూస్ ముఖ్య పాత్రలు పోషించారు. దుల్కర్ సల్మాన్, టోవినో థామస్, షౌబిన్ అతిథి పాత్రల్లో మెరిశారు. దుల్కర్ సల్మాన్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు. తాజాగా కొత్త లోక స్ట్రీమింగ్ పై అఫీషియల్ అనౌన్సె మెంట్ వచ్చింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ హాట్ స్టార్ కొనుగోలు చేసింది. ఈ మేరకు త్వరలోనే ఈ సినిమా ఓటీటీకి రానుందని జియో హాట్ స్టార్ అధికారికంగా ప్రకటించింది. కచ్చితమైన తేదీ ప్రకటించలేదు కానీ త్వరలోనే రిలీజ్ తేదీని రివీల్ చేస్తామని పోస్టర్ పంచుకున్నారు. బహుశా దీపావళి కానుకగా కొత్త లోక ఓటీటీలోకి రావొచ్చునని తెలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నరేష్‌కు కాబోయే భార్య ఈమే.. త్వరలో పెళ్లి
డాన్స్ కాదు..చిన్నపాటి రొమాన్స్.. పవన్ తీరుతో.. మొఖం మాడ్చుకున్న రీతూ
పైసలు చాలట్లేదు.. ఈ మంత్రి పదవి నాకొద్దు.. సీనియర్ హీరో ఆవేదన
నా భర్తతో అదే సమస్య అందుకే నాలుగేళ్లుగా శ్రీనివాస్‌తో.. తన బాధను చెప్పుకున్న మాధురి
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

