Nayanthara: నయనతార అందుకే నెం.1 హీరోయిన్
40 దాటిన తర్వాత కూడా నయనతార ఇంకా నెంబర్ వన్ హీరోయిన్‌గా ఎలా ఉన్నారు..? ఆమెతో పాటు వచ్చిన భామలంతా సపోర్టింగ్ క్యారెక్టర్స్‌కు షిప్ట్ అయిపోయినా.. నయన్ మాత్రమే ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు..? మిగిలిన ముద్దుగుమ్మల్లో లేనిదేంటి.. నయనతారలో మాత్రమే ఉన్నదేంటి..? ఆ స్పెషల్ క్వాలిటీతోనే నయన్ దున్నేస్తున్నారా..? 40 ఏళ్లలోనూ నెంబర్ వన్ హీరోయిన్‌గా ఉండటం అనేది చిన్న విషయం కాదు.. కానీ తనకు ఇవన్నీ మామూలే అంటున్నారు నయనతార.
ఈ భామ దూకుడు ముందు కుర్ర హీరోయిన్లు సైతం నిలబడలేకపోతున్నారు. ఒక్కో సినిమాకు 15 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటూ.. చాలా మంది హీరోయిన్లకు నిద్ర లేకుండా చేస్తున్నారు నయన్. ప్రస్తుతం చిరంజీవి సినిమాలో నటిస్తున్నారు ఈ భామ.రెమ్యునరేషన్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వరు నయనతార. ఆమె ఎన్ని కండీషన్స్ పెట్టినా.. నిర్మాతలే కాంప్రమైజ్ అవుతుంటారు. ప్రస్తుతం మన శంకరవరప్రసాద్ గారూ సినిమాలో చిరుతో జోడీ కట్టారు నయన్. ఈ చిత్ర షూటింగ్ సమయంలోనే అనిల్ వర్కింగ్ స్టైల్‌కు నయనతార ఫిదా అయిపోయారు. తాజాగా పాటలోనూ నయన్ లుక్స్ అదిరిపోయాయి. మామూలుగా అంత ఈజీగా ఏ దర్శకుడిని ప్రశంసించని నయన్.. అనిల్ రావిపూడికి వర్కింగ్ స్టైల్‌కి పడిపోయారు. చెప్పిన టైమ్ కంటే ముందుగానే షెడ్యూల్స్ పూర్తి చేస్తున్న అనిల్ తెలివి తేటలు చూసి మురిసిపోతున్నారు ఈ సీనియర్ హీరోయిన్. పైగా చిరు, నయన్ జోడీకి కూడా మంచి మార్కులు పడుతున్నాయి. ఇద్దరి కెమిస్ట్రీ కూడా అదిరిపోయింది. అనుష్క పెద్దగా కనిపించట్లేదు.. తమన్నా స్పెషల్ సాంగ్స్‌కు సెట్ అయిపోయారు.. త్రిష మునపట్లా మెరవట్లేదు.. సమంత ఓటిటి వైపు వెళ్తున్నారు.. కాజల్ సైడ్ క్యారెక్టర్స్‌కు షిఫ్ట్ అయిపోయారు.. కానీ నయన్ మాత్రం నేటికి టాప్‌లోనే ఉన్నారు. ఎందుకంటే సీనియర్ హీరోలకు పర్ఫెక్ట్ ఛాయిస్ అయ్యారు కాబట్టి. మొత్తానికి ఈమె దూకుడు ఇప్పట్లో తగ్గడం కష్టమే.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హైకోర్టులో హీరోకు వింత అనుభవం.. నవ్వాలో.. ఏడవాలో తెలియని పరిస్థితి
OTTలోకి సూపర్ హిట్ మూవీ కొత్తలోక
నరేష్‌కు కాబోయే భార్య ఈమే.. త్వరలో పెళ్లి
డాన్స్ కాదు..చిన్నపాటి రొమాన్స్.. పవన్ తీరుతో.. మొఖం మాడ్చుకున్న రీతూ
పైసలు చాలట్లేదు.. ఈ మంత్రి పదవి నాకొద్దు.. సీనియర్ హీరో ఆవేదన
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

