AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీన్ రివర్స్.. టికెట్ రేట్లపై మళ్లీ బాంబు

సీన్ రివర్స్.. టికెట్ రేట్లపై మళ్లీ బాంబు

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: Phani CH|

Updated on: Oct 16, 2025 | 4:53 PM

Share

కర్ణాటకలో టికెట్ రేట్లపై మరోసారి గుదిబండ పడబోతుందా..? ప్రభుత్వం ఈ విషయంలో ఇంకో సంచలన నిర్ణయం వైపు అడుగులు వేస్తుందా..? కోర్టు ఇచ్చిన స్టేతో కాంతార లాంటి సినిమాలు పండగ చేసుకున్నాయి. కానీ రాబోయే రోజుల్లో ఈ అడ్వాంటేజ్ మిగిలిన సినిమాలకు ఉంటుందా లేదా..? అసలేం జరుగుతుంది కర్ణాటకలో..? కర్ణాటకలో మల్టీప్లెక్స్, సింగల్ స్క్రీన్ ఏదైనా సరే.. సినిమా టికెట్ గరిష్ట టికెట్ ధర 200 రూపాయలు లోపే ఉండాలని GO జారీ చేస్తే.. కోర్టుకు వెళ్లి మరీ మునపటి రేట్లు తెచ్చుకున్నారు నిర్మాతలు, మల్టీప్లెక్స్ ఓనర్లు.

దాంతో మరోసారి అక్కడ ఫ్లెక్సీబుల్ ప్రైసింగ్ వచ్చింది. అది వాడుకునే కాంతార, ఓజి సినిమాలకు అదిరిపోయే వసూళ్లు వచ్చాయక్కడ. బిసి సెంటర్స్‌లో ఈ టికెట్ రేట్ల సమస్య లేకపోయినా కూడా.. మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్స్ బాల్కనీల్లో మాత్రం హై టికెట్ రేట్లున్నాయి కర్ణాటకలో. హుబ్లీ, ధార్వాడ్, బెళగావి లాంటి నగరాల్లో వీకెండ్ వచ్చేసరికి 1200 రూపాయల వరకు రేట్లు ఉన్నాయి. ప్రభుత్వం ప్రధానంగా దీనిపై ఫోకస్ చేసి 200 రూపాయలకు ఫిక్స్ చేసింది ప్రభుత్వం. కానీ కోర్టు స్టేతో అది హోల్డ్‌లో పడింది. కర్ణాటకలో కోర్టు ఇచ్చిన తీర్పు తాత్కాలిక ఉపశమనం మాత్రమే. త్వరలోనే సర్కార్ తమ వాదనలతో సిద్ధంగా ఉందని తెలుస్తుంది. ఒకవేళ అవి బలంగా ఉంటే GO మళ్లీ వచ్చే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే రాజా సాబ్, టాక్సిక్, అఖండ 2 లాంటి ప్యాన్ ఇండియా సినిమాల కలెక్షన్లపై కర్ణాటకలో తీవ్ర ప్రభావం తప్పదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వేలకోట్లకు అధిపతి.. అయినా సైకిల్‌పైనే సవారీ

భారత్‌లోనే రిచ్చెస్ట్ మహిళ రోష్ని.. ఆస్తి విలువ తెలిస్తే మైండ్ బ్లాకే

Nayanthara: నయనతార అందుకే నెం.1 హీరోయిన్‌

హైకోర్టులో హీరోకు వింత అనుభవం.. నవ్వాలో.. ఏడవాలో తెలియని పరిస్థితి

OTTలోకి సూపర్ హిట్ మూవీ కొత్తలోక

Published on: Oct 16, 2025 04:50 PM