Actress : ఇద్దరూ తోపు హీరోయిన్స్ అక్కాచెల్లెళ్లు.. ఇద్దరికీ మాటల్లేవ్.. ఒకరు టాలీవుడ్.. ఇంకొకరు బాలీవుడ్..
ఈ ఇద్దరు హీరోయిన్స్ అక్కాచెల్లెళ్లు. కానీ ఒకరితో ఒకరికి మాటలు లేవు. అటు అక్క బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస హిట్లతో దూసుకుపోతుంటే.. చెల్లి మాత్రం టాలీవుడ్ లో ఇరగదీస్తుంది. ఇద్దరు బంధువులే అయినప్పటికీ ఇప్పటివరకు తమ బంధం గురించి ఎక్కువగా మాట్లాడలేదు. ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న స్టార్స్ ఎవరో తెలుసా.. ? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే.

సినీరంగంలో అనేక మంది నటీనటులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకే కుటుంబం నుంచి వచ్చి.. స్టార్ డమ్ సంపాదించుకున్న స్టార్స్ చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఇద్దరు హీరోయిన్స్ మాత్రం అక్కాచెల్లె్ళ్లు. అయినప్పటికీ ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. ఒకరు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ కగా.. మరొకరు బాలీవుడ్ లో అగ్ర కథానాయిక. ఇంతకీ ఆ ఇద్దరు మరెవరో కాదు.. తెలుగు హీరోయిన్ ప్రియమణి, బీటౌన్ బ్యూటీ విద్యాబాలన్. అవును.. వీరిద్దరు కజిన్స్. సినిమాల్లోకి రాకముందే వీళ్లు బంధువులు. అయితే వాళ్లు ఎప్పుడూ కూడా కలిసి కనిపించరు. అలాగే ఒకరితో ఒకరు స్నేహంగా.. మాట్లాడుతూ ఉండరు. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియమణి తమ బంధం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.
ఇవి కూడా చదవండి : Serial Actress: అబ్బబ్బో.. అదరగొట్టేస్తోన్న రుద్రాణి అత్త.. నెట్టింట గ్లామర్ గత్తరలేపుతున్న సీరియల్ విలన్..
గతంలో ఆమె మాట్లాడుతుతూ.. “మేము బంధువులం అయినప్పటికీ ఒకరితో ఒకరు మాట్లాడుకోము. నేను విద్యాబాలన్ తండ్రితో ఎక్కువగా మాట్లాడుతుంటాను. ఆయన నాకు ఎప్పుడూ ఫోన్ చేస్తారు. అలాగే మా నాన్న సైతం వారితో క్లోజ్ గా ఉంటారు. విద్యాబాలన్ అద్భుతమైన నటి. మేము ఎప్పుడూ ఒకరినొకరు గౌరవిస్తాము. ఒక ప్రేక్షకురాలిగా ఆమెను ఎప్పుడూ ఆరాధిస్తాను.” అంటూ చెప్పుకొచ్చింది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, కమల్ హాసన్‌తో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు విదేశాల్లో వ్యాపారాలు.. ఈ బ్యూటీ క్రేజ్ వేరప్పా..
ఇదిలా ఉంటే.. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ గా ఉన్న ప్రియమణి.. ఇప్పుడు హిందీలో పలు వెబ్ సిరీస్ చేస్తుంది. తెలుగులో అనేక చిత్రాల్లో నటించిన ఆమె.. రాజ్ & డికె నుంచి వచ్చిన సూపర్ హిట్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3లో నటించనుంది. ఇందులో సుచిత్ర పాత్రలో కనిపించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి : ఆ ఒక్క జ్యూస్.. 51 ఏళ్ల వయసులో మలైక అందం వెనుక రహస్యం ఇదేనట.








