Sai Pallavi: ఒక్కటే పీస్.. హైబ్రీడ్ పిల్ల.. స్టార్ హీరోలకు గట్టిపోటీ.. క్రేజ్‌లో ఎవ్వరూ రారు సాటి..
ఏ నిమిషంలో వచ్చిండే అంటూ సాయి పల్లవి తెలుగు ఇండస్ట్రీకి వచ్చిందో కానీ.. అప్పట్నుంచి ఈమె నటనకు అంతా ఫిదా అయిపోతున్నారు. సినిమాలో ఈమె ఉందంటే చాలు.. మిగిలిన వాళ్లంతా సైడ్ అయిపోవాల్సిందే..!

టాలీవుడ్(Tollywood)లో ప్రస్తుతం సాయి పల్లవి(Sai Pallavi) క్రేజ్ మాములుగా లేదు. వరుస సినిమాలు చేస్తూ, ఎక్కడా అసభ్యతకు తావు లేకుండా నటిస్తూ, తనకంటూ ఓ స్పెషల్ స్థానాన్ని సంపాదించుకుంది. అయితే, సాయి పల్లవి సినిమాలో స్టార్ హీరోలున్నా.. అందరి చూపు ఈ హైబ్రీడ్ పిల్లవైపే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అసలు ఈ ఫిదా బ్యూటీకి ఇంత క్రేజ్ ఎందుకొచ్చింది. సాయి పల్లవి సినిమాలో ఉంటే హీరోలతో పనిలేదా..? హీరోలున్నా కూడా.. ఆమె దెబ్బకు కనిపించడం లేదా..? స్టార్ హీరోలతో సమానంగా సాయి పల్లవికి క్రేజ్ రావడానికి కారణమేంటి..? స్టార్ హీరోలతో కమర్షియల్ సినిమాలు చేస్తున్నా.. మిగిలిన హీరోయిన్లకు రాని గుర్తింపు కేవలం ఈ న్యాచురల్ బ్యూటీకి మాత్రమే ఎందుకొస్తుంది..? అసలు సాయి పల్లవి చేస్తున్న మాయేంటి..?
ఏ నిమిషంలో వచ్చిండే అంటూ సాయి పల్లవి తెలుగు ఇండస్ట్రీకి వచ్చిందో కానీ.. అప్పట్నుంచి ఈమె నటనకు అంతా ఫిదా అయిపోతున్నారు. సినిమాలో ఈమె ఉందంటే చాలు.. మిగిలిన వాళ్లంతా సైడ్ అయిపోవాల్సిందే..! సాయి పల్లవి నటన ముందు.. ఆమె స్క్రీన్ ప్రజెన్స్ ముందు హీరోలసలు కనిపించడం లేదనేది విశ్లేషకుల వాదన. చేసింది తక్కువ సినిమాలే అయినా.. మరే హీరోయిన్‌కు లేని ఇమేజ్ ఈ న్యాచురల్ బ్యూటీ సొంతం చేసుకుంది.
తాజాగా విరాట పర్వం సినిమాతో సాయి పల్లవి ప్రేక్షకుల ముందుకు వస్తుంది. జూన్ 17న విడుదల కానున్న ఈ చిత్ర ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. రిలీజ్ డేట్ ప్రకటించిన రోజు నుంచి.. ఇది రానా సినిమా కంటే కేరాఫ్ సాయి పల్లవి పేరు మీదే ఎక్కువగా చర్చల్లో నిలుస్తుంది. పైగా రానా కూడా ఈ సినిమాలో సాయి పల్లవి హీరో అని చెప్పడం.. లేడీ సూపర్ స్టార్ అని పొగడ్తల వర్షం కురిపించడం మరింత ఆసక్తిని పెంచేసింది.




కెరీర్ మొదట్నుంచి పాత్రల ఎంపికలో సాయి పల్లవి చూపిస్తున్న వైవిధ్యమే ఈమెను ఇతర హీరోయిన్ల నుంచి వేరు చేస్తుంది. గ్లామర్ ఇండస్ట్రీలో పర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రల్ని ఎంచుకుంటూ తన ఇమేజ్ పెంచుకుంటుంది. విరాట పర్వం చిత్రం పూర్తిగా వెన్నెల అనే పాత్ర చుట్టూ తిరుగుతుంది.. ఈ పాత్రలో పల్లవి నటించారు. ఈ సినిమా విడుదలయ్యాక.. ఫలితంతో సంబంధం లేకుండా ఈ న్యాచురల్ బ్యూటీ రేంజ్ మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తుంది.
