Vijay Devarakonda’s Liger : కరోనా ఎఫెక్ట్ .. క్యాన్సిల్ అయిన విజయ్ దేవరకొండ లైగర్ మూవీ షూటింగ్..

డైనమిక్ డైరెక్టర్ పూరీజగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా లైగర్. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ పాన్ ఇండియా ఫిలిం గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Vijay Devarakonda's Liger : కరోనా ఎఫెక్ట్ .. క్యాన్సిల్ అయిన విజయ్ దేవరకొండ లైగర్ మూవీ షూటింగ్..
Liger
Follow us

|

Updated on: Jan 07, 2022 | 6:41 PM

Vijay Devarakonda’s Liger : డైనమిక్ డైరెక్టర్ పూరీజగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా లైగర్. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ పాన్ ఇండియా ఫిలిం గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. లైగర్ సినిమాతో విజయ్ బాలీవుడ్ లోకి అనన్య టాలీవుడ్ లోకి ఒకేసారి ఎంట్రీ ఇస్తున్నారు. ఇక ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల న్యూఇయర్ సందర్భంగా అభిమానులకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేశారు పూరి అండ్ టీం. చిత్రప్రమోషన్స్‏లో భాగంగా లైగర్ గ్లింప్స్‌ను రిలీజ్ చేసి విజయ్ దేవరకొండ అభిమానుల్లో జోష్ నింపారు. పూరి మార్క్ యాక్షన్ సన్నివేశాలతో కట్ చేసిన ఈ వీడియో.. విడుదలైన క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. కరోనా తోపాటు ఓమైక్రాన్ కూడా వ్యాపిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరోనా దెబ్బకు సంక్రాంతికి రిలీజ్ అవవల్సిన సినిమాలు కూడా వెనక్కి తగ్గాయి. ఈ సంక్రాంతికి ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లాంటి పెద్ద సినిమాలు సందడి చేయాలనీ చూశాయి. కానీ ఆశాల పై కరోనా నీళ్లు జల్లేసింది. దాంతో ఒకొక్కటికి సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న లైగర్ పైన కూడా కరోనా ఎఫెక్ట్ పడింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో షూటింగ్ కు బ్రేక్ ఇచ్చినట్టు నిర్మాత నటి ఛార్మీ తెలిపారు. ఒమిక్రాన్ కేసులు కూడా రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో షూటింగ్ చేయడం కూడా కరెక్ట్ కాదని లైగర్ టీం నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు విజయ్ దేవరకొండ, ఛార్మీ. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.. ఇలాంటి సమయంలో మా టీం కాస్ట్ అండ్ క్రూని రిస్క్‌లో పెట్టాలని అనుకోవడం లేదు.. అందుకే లైగర్ షూటింగ్‌ను క్యాన్సిల్ చేశాం.. అందరూ సురక్షింగా ఇంట్లోనే ఉండండి అని ఛార్మీ  ట్విట్టర్ లో తెలిపారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Mahesh Babu: మహేష్ బాబు త్వరగా కోలుకోవాలని అభిమానుల ప్రత్యేక పూజలు..

Major : మహేష్, దుల్కర్ చేతుల మీదుగా అడివి శేష్ ‘మేజర్’ ఫస్ట్ సింగిల్.. ఆకట్టుకుంటున్న హృదయమా సాంగ్..

Samantha’s Yashoda: శరవేగంగా యశోద మూవీ షూటింగ్.. సెకండ్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన సమంత..

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.