Taapsee Pannu: ‘అది నిజమైతే నేనే మీకు స్వయంగా చెబుతా’.. రూమర్‌పై స్పందించిన తాప్సీ..

Taapsee Pannu: తెలుగులో వచ్చిన ఝుమ్మంది నాదం చిత్రంతో వెండి తెరకు పరిచయమైంది అందాల తార తాప్సీ. తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకున్న తాప్సీ అనతికాలంలోనే..

Taapsee Pannu: 'అది నిజమైతే నేనే మీకు స్వయంగా చెబుతా'.. రూమర్‌పై స్పందించిన తాప్సీ..
Follow us

|

Updated on: Jan 07, 2022 | 6:32 PM

Taapsee Pannu: తెలుగులో వచ్చిన ఝుమ్మంది నాదం చిత్రంతో వెండి తెరకు పరిచయమైంది అందాల తార తాప్సీ. తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకున్న తాప్సీ అనతికాలంలోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. తెలుగులో వరుస సినిమాలు దక్కించుకుంటూ బిజీగా హీరోయిన్‌గా మారింది. అయితే ఆ తర్వాత తెలుగులో బిజీగా ఉన్న సమయంలోనే బాలీవుడ్‌ బాట పట్టిందీ బ్యూటీ. అక్కడ కూడా వరుస అవకాశాలను సొంతం చేసుకుంటూ బ్యాక్‌ టు బ్యాక్‌ ఆఫర్లను సొంతం చేసుకుంది. గ్లామర్‌ కంటే నటనకు ప్రాధానత్య ఉన్న పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ ఏకంగా బాలీవుడ్‌ బాద్షాషా షారుఖ్‌ ఖాన్‌తో నటించే అవకాశం దక్కించుకుందంటూ ఓ వార్త బాగా వైరల్‌ అయ్యింది.

రాజ్‌కుమార్‌ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షారుఖ్‌ హీరోగా నటిస్తుండగా, హీరోయిన్‌గా తాప్సీ నటించనుందని బీటౌన్‌లో వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఈ నేపథ్యంలో తొలిసారి ఈ వార్తలపై తాప్సీ అధికారికంగా స్పందించింది. ఈ విషయమై తాప్సీ మాట్లాడుతూ.. ‘ఈ వార్త నిజమే అయితే అందరికంటే ముందు నేనే స్వయంగా మీకు చెబుతాను. ముందు ప్రాజెక్ట్‌ ఫైనల్‌ కానివ్వండి. లేదంటే ఊహాగానాలుగా మాత్రమే మిగిలిపోతాయి. ఈ విషయం కాన్ఫామ్‌ కాగానే ఇంటిపైకెక్కి అందరికీ వినిపించేలా కేకలు పెట్టి మరీ ప్రకటిస్తాను’ అంటూ చెప్పుకొచ్చిందీ బ్యూటీ. ఈ లెక్కన తాప్సీ, షారుఖ్‌ సినిమాలో నటించే విషయమై చర్చలు జరగుతున్న విషయం నిజమేనని అర్థమవుతోంది. మరి ఈ వార్త కార్యరూపం దాల్చుతుందో లేదో చూడాలి.

Tapsee Sharukh

Also Read: Anup Rubens: అందుకే ఒక‌టికి ప‌దిసార్లు క్రాస్ చెక్ చేసుకోవాల్సి వచ్చింది.. అనూప్ రూపెన్స్ ఆసక్తికర కామెంట్స్..

Samantha’s Yashoda: శరవేగంగా యశోద మూవీ షూటింగ్.. సెకండ్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన సమంత..

Kurnool: ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఫుడ్‌ ఫాయిజన్‌.. 40 మంది విద్యార్థులకు అస్వస్థత..