AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonusood: కీలక నిర్ణయం తీసుకున్న సోనూసూద్‌.. ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన..

కరోనా, లాక్‌డౌన్‌ సమయంలో ఎంతోమందికి ఆపన్నహస్తం అందించి రియల్‌ హీరో అనిపించుకున్నారు నటుడు సోనూసూద్‌. వలస కార్మికులు, కూలీలు, కోవిడ్‌ కారణంగా ఆస్పత్రిలో

Sonusood: కీలక నిర్ణయం తీసుకున్న సోనూసూద్‌.. ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన..
Sonusood
Basha Shek
|

Updated on: Jan 08, 2022 | 10:46 AM

Share

కరోనా, లాక్‌డౌన్‌ సమయంలో ఎంతోమందికి ఆపన్నహస్తం అందించి రియల్‌ హీరో అనిపించుకున్నారు నటుడు సోనూసూద్‌. వలస కార్మికులు, కూలీలు, కోవిడ్‌ కారణంగా ఆస్పత్రిలో ఉన్న రోగులకు తన చేతనైన వైద్య సదుపాయాలు అందించి ‘హెల్పింగ్‌ స్టార్‌’గా మారిపోయారు. ఈక్రమంలో తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు సోనూసూద్‌. పంజాబ్‌ ఎన్నికల్లో భాగంగా​ ఎన్నికల సంఘం గతేడాది సోనూసూద్‌ను ‘స్టేట్‌ ఐకాన్‌’గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు పంజాబ్‌ ‘స్టేట్‌ ఐకాన్‌’ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ విషయాన్ని తనే ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. ‘అన్ని మంచి విషయాల్లాగే, ఈ ప్రయాణం కూడా ముగిసింది. పంజాబ్‌ స్టేట్‌ ఐకాన్‌గా నా ప్రయాణాన్ని ముగిస్తున్నా. స్వచ్ఛందంగానే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా సోదరి పంజాబ్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అందుకే ఎన్నికల సంఘంతో చర్చించి సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నాను’ అని ట్విట్టర్లో పేర్కొన్నారీ రియల్‌ హీరో. ’

కాగా తన సేవా కార్యక్రమాలతో ప్రజల మనసుల్లో అశేష అభిమానం సంపాదించుకున్న సోనూ రాజకీయాల్లోకి వస్తారని చాలామంది భావించారు. అయితే పాలిటిక్స్‌పై తనకు ఆసక్తి లేదని కొన్ని సందర్భాల్లో చెప్పుకొచ్చారు. కానీ గతేడాది నవంబర్‌లో ఆయన సోదరి మాళవిక సూద్‌ పంజాబ్‌ అసెంబ్లీలో పోటీ చేయనున్నారని సోనూ ప్రకటించారు. అయితే ఏ పార్టీ నుంచి ఆమె పోటీ చేస్తారన్న విషయంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. ఈ ప్రకటన అనంతరం పంజాబ్‌ సీఎం చరణ్‌జిత్‌ చన్నీతో కూడా భేటీ అయ్యారు సోనూసూద్‌. దీంతో మాళవిక సూద్‌ కాంగ్రెస్‌ నుంచి పోటీ చేయనున్నారని వార్తలు కూడా వచ్చాయి. అదే సమయంలో ఢిల్లీలో ‘దేశ్ కా మెంటర్స్’ అనే విద్యార్థుల సంబంధించిన ఓ కార్యక్రమానికి సోనూసూద్‌ను సీఎం కేజ్రీవాల్‌ అంబాసిడర్‌గా ప్రకటించారు. దీంతో ఆప్‌ తరఫున పోటీచేస్తారేమోనన్న ఊహగానాలు కూడా వినిపించాయి. అయితే పార్టీ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెల్లడించలేదు.

Also Read:

Nidhhi Agerwal: ఆ స్టార్‌ హీరోతో ప్రేమాయణం సాగిస్తోన్న ఇస్మార్ట్‌ బ్యూటీ!.. త్వరలోనే పెళ్లి?

Pushpa: ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌.. పుష్ప ఓటీటీ వెర్షన్‌లో అదనపు సీన్లు.. సామ్‌ స్పెషల్‌ సాంగ్‌లోనూ న్యూ విజువల్స్‌..

Viral news: ఇది లూడో ప్రేమ కథా చిత్రమ్‌.. పాక్‌ యువకుడితో రాజస్థాన్‌ మహిళ లవ్‌.! ఫైనల్‌ ట్విస్ట్‌ మాములుగా లేదుగా..