Pushpa: ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌.. పుష్ప ఓటీటీ వెర్షన్‌లో అదనపు సీన్లు.. సామ్‌ స్పెషల్‌ సాంగ్‌లోనూ న్యూ విజువల్స్‌..

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ , క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌ తెరకెక్కిన చిత్రం ' పుష్ప'. రష్మిక మందన హీరోయిన్‌గా నటించగా, సమంత స్పెషల్‌ సాంగ్‌లో అదరగొట్టింది

Pushpa: ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌.. పుష్ప ఓటీటీ వెర్షన్‌లో అదనపు సీన్లు.. సామ్‌ స్పెషల్‌ సాంగ్‌లోనూ న్యూ విజువల్స్‌..
Pushpa Ott
Follow us
Basha Shek

|

Updated on: Jan 08, 2022 | 9:47 AM

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ , క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌ తెరకెక్కిన చిత్రం ‘ పుష్ప’. రష్మిక మందన హీరోయిన్‌గా నటించగా, సమంత స్పెషల్‌ సాంగ్‌లో అదరగొట్టింది. అనసూయ, సునీల్‌, ఫాహద్‌ పాజిల్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. గతేడాది డిసెంబర్‌ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన పుష్ప: ది రైజ్ పార్ట్ 1 భారీ విజయం సొంతం చేసుకుంది. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ రికార్డు కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇప్పటివరకు థియేటర్లలో అలరించిన బన్నీ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తోంది. నిన్న(జనవరి7) రాత్రి 8 గంటల నుంచి ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. అయితే ‘పుష్ప’ థియేట్రికల్ వెర్షన్‌లో లేనివి కొన్ని డిజిటల్ వెర్షన్‌లో ఉన్నాయని ఓటీటీలో సినిమాను చూసిన వారంటున్నారు.

‘పుష్ప’ సినిమాలో సమంత చేసిన ‘ ఉ అంటావా.. ఊహూ అంటావా’ అనే సాంగ్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే థియేట్రికల్‌ వెర్షన్‌లో ఈ సాంగ్‌ కొద్ది సేపు ఉండడంతో సినీ అభిమానులు కాస్త నిరాశకు లోనయ్యారు. ఇప్పుడు ఈ లోటును తీర్చుతూ ఈ స్పెషల్‌ సాంగ్‌లో మరికొన్ని విజువల్స్‌ను యాడ్ చేశారట. అదేవిధంగా థియేట్రికల్‌ వెర్షన్‌లో ఉన్న కొన్ని అనవసరమైన సన్ని వేశాలను కూడా ఓటీటీలో ట్రిమ్‌ చేశారట. అందుకే థియేటర్లలో సినిమా నిడివి 2 గంటల 59 నిమిషాలు ఉండగా.. ఇప్పుడు ఓటీటీ రన్ టైమ్ మాత్రం 2 గంటల 55 నిమిషాలే ఉందట. అయితే థియేటర్లలో ప్రేక్షకులు చూడని కొన్ని కొత్త సన్నివేశాలను డిజిటల్‌ వెర్షన్‌లో జోడించారట. మొత్తానికి ఓటీటీ ప్రేక్షకులకు మాత్రం ‘పుష్ప’ మంచి సర్‌ప్రైజ్ అనే చెప్పాలి.

Also Read:

Viral news: ఇది లూడో ప్రేమ కథా చిత్రమ్‌.. పాక్‌ యువకుడితో రాజస్థాన్‌ మహిళ లవ్‌.! ఫైనల్‌ ట్విస్ట్‌ మాములుగా లేదుగా..

Viral video: ఈ ఖైదీ చాలా ఇంటెలిజెంట్‌.. చేతికి సంకెళ్లున్నా ఎలా తప్పించుకున్నాడో చూడండి..

Viral news: 40 వసంతాల ప్రేమ.. ఇప్పుడు పెళ్లిపీటలెక్కింది.. పెళ్లి కుమారుడు ఎవరో తెలిస్తే నోరెళ్ల బెట్టడం ఖాయం..