Ajith’s Valimai : అజిత్ ‘వాలిమై’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేది అప్పుడేనా..?
తమిళ్ స్టార్ హీరో అజిత్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి అవసరం లేదు. ప్రస్తుతం ఆయన వలిమై సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు

Ajith’s Valimai : తమిళ్ స్టార్ హీరో అజిత్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి అవసరం లేదు. ప్రస్తుతం ఆయన వలిమై సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా కోసం అజిత్ అభిమానులు ఎంతో ఆసక్తిగాఎదురుచూస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో విడుదల చేయనున్నారు. జీ స్టూడియోస్ సంస్థ, బేవ్యూ ప్రాజెక్ట్స్ పతాకంపై బోనీకపూర్ నిర్మిస్తున్నఈ చిత్రాన్ని హెచ్. వినోద్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవల విడుదల చేసిన తమిళ ట్రైలర్ 20 మిలియన్ కు పైగా వ్యూస్ తో రికార్డు క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా జనవరి 13న విడుదల చేయాలనుకున్నారు. కానీ తమిళనాడు లో కరోనా ప్రభావంతో థియేటర్స్ మూతపడ్డాయి. దాంతో సినిమాను వాయిదా వేశారు.
అజిత్ ఫ్యాన్స్ కోరుకున్న విధంగానే గ్రాండ్ విజువల్స్ తో చిత్రం ఆద్ధ్యంతం ఉంటుందని తెలుస్తుంది. తెలుగులో ‘ఖాకి’గా విడుదల అయిన కార్తీ తమిళ సినిమా ‘థీరన్ అధిగారం ఒండ్రు’ సినిమాకు దర్శకత్వం వహించిన హెచ్. వినోద్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అజిత్‌తో ఆయనకు రెండో చిత్రమిది. అజిత్ క్రేజ్ కి తగ్గట్లుగా వినోద్ ఈ చిత్రంలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ , ఛేజింగ్ సీన్లు డిజైన్ చేశారు. ఛేజింగ్ సీన్లు ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా ఉంటాయని టాక్ . అలాగే ఓ పవర్ ఫుల్ పోలీస్ గా అజిత్ కనిపించనున్నాడు. హీరో అజిత్‌కి బైక్స్, బైక్ రైడ్స్ అంటే ఎంత ఇష్టం అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డూప్ సహాయం లేకుండా తన సినిమాల్లో స్టంట్స్, ముఖ్యంగా బైక్ రైడింగ్ సీన్స్ చేస్తుంటారు. కొన్నిసార్లు షూటింగులో గాయపడ్డారు కూడా! అయినా సరే ఏ మాత్రం లెక్కచేయకుండా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. ఇక ఈ చిత్రంలో తెలుగు హీరో కార్తికేయ కీలక మైన పాత్రలో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా సమ్మర్ కు షిఫ్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే తెలుగు భారీ సినిమాలు ఆర్ఆర్ఆర్ , రాధేశ్యామ్ లాంటి సినిమాలు కూడా సమ్మర్ ను టార్గెట్ చేసే రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో వాలిమై కూడా సమ్మర్ రేస్ లో పాల్గొనే అవకాశం ఉందని వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. చూడాలి మరి ఏంజరుగుతుందో..
మరిన్ని ఇక్కడ చదవండి :




